జియోకు షాక్: రూ.20 నెలకు డేటా సేవలు ప్రారంభించనున్న డేటావిండ్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:రియలన్స్ జియో ఇతర టెలికం కంపెనీలకు ఏ రకంగా షాక్ ఇచ్చిందో, జియోకు డేటా విండ్ కూడ షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది. నెలకు రూ.20 చెల్లిస్తే డేటా సేవలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడమే ఓ సంచలనం.జియో మార్కెట్లోకి రావడం వల్లే ఇతర టెలికం కంపెనీలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఆరుమసాల పాటు ఉచిత సేవలను ఇచ్చిన రిలయన్స్ జియో , ఏప్రిల్ నుండి తమ చందాదారుల నుండి డబ్బులు వసూలు చేయనుంది.

అయితే ఈ మేరకు రిలయన్స్ జియో తమ టారిఫ్ ప్లాన్లను ప్రకటించింది.అయితే జియోకు ధీటుగానే ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ల్ ప్లాన్లలో మార్పులు చేర్పులు చేశాయి.

జియోకు డేటావిండ్ షాక్

జియోకు డేటావిండ్ షాక్

ఇతర టెలికం కంపెనీలకు రిలయన్స్ జియో షాకిస్తే , డేటా విండ్ కంపెనీ రిలయన్స్ జియోకు షాకిచ్చింది. అతి తక్కువ ధరకే డేటా సేవలను అందించాలని నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంతో రిలయన్స్ జియోకు షాకిచ్చింది.భారత టెలికం వ్యాపారంలోకి వందకోట్ల పెట్టుబడులతో డేటావిండ్ ప్రవేశిస్తోంది.

రూ.20 డేటా ప్లాన్ ను ఇవ్వనున్న డేటా విండ్

రూ.20 డేటా ప్లాన్ ను ఇవ్వనున్న డేటా విండ్

నెలకు రూ.20 లేదా అంతకంటే తక్కువ డేటా ప్లాన్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు డేటావిండ్ ప్రకటించింది. మరో నెలరోజుల్లో డేటావిండ్ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. డేటా సేవలపైనే కేంద్రీకరించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

టారిఫ్ ప్లాన్లను సమీక్షిస్తున్న టెలికం కంపెనీలు

టారిఫ్ ప్లాన్లను సమీక్షిస్తున్న టెలికం కంపెనీలు

రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఇప్పటికే టెలికం కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్లను సమీక్షించాయి.ఏప్రిల్ 1 నుండి ఒకవైపు జియో టారిఫ్ ప్లాన్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. మరో వైపు అనేక స్వదేశీ, విదేశీ టెలికం ఆపరేటర్లు తమ ప్లాన్లు సమీక్షించుకొంటున్నాయి.దేశీయ టెలికం బిజినెస్ పై కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ డేటా విండ్ కన్నేసింది. టెలికం స్పేస్ లో మరోక గేమ్ ఛేంజర్ గా నిలవనుంది.

ఏడాదికి రూ.200 డేటా సేవలు అందించనున్న డేటా విండ్

ఏడాదికి రూ.200 డేటా సేవలు అందించనున్న డేటా విండ్

3జీ, 4 జీ సేవలను అందించే దిశగా వ్యాపారాన్ని మరో నెల రోజుల్లో డేటా విండ్ ప్రారంభించనుంది. ఖాతాదారులకు ఏడాదికి రూ.200 చెల్లిస్తే డేటా సేవలను అందించాలని ఆ కంపెనీ ప్లాన్ చేస్తోంది.బడ్జెట్ ఫోన్లు, తక్కువ ధరలకే ల్యాప్ టాప్ లను అందిస్తోంది డేటా విండ్. దేశ వ్యాప్తంగా వర్చ్యువల్ నెట్ వర్క్ ఆపరేటింగ్ కోసం ధరఖాస్దు చేసింది డేటావిండ్.దీనికి అనుమతి లభిస్తే మొదటి ఆరుమాసాల పాటు ఏడాదికి రూ.200 డేటా సర్వీసులను అందించనుంది.

చౌక ప్లాన్లపై డేటావిండ్ ప్లాన్

చౌక ప్లాన్లపై డేటావిండ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.300 ప్లాన్ నెలకు వెయ్యి నుండి 1500 రూపాయాలను ఖర్చు చేసేవారు మాత్రమే భరించనున్నారు.అయితే 300 మిలియన్ ప్రజలే ఈ టారిఫ్ ను ఆమోదించే అవకాశాలున్నాయని డేటావిండ్ కంపెనీ సిఈఓ సింగ్ తులి అభిప్రాయపడ్డారు. నెలకు రూ.90 కంటే తక్కువ ఖర్చు కోసం దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. నెలకు రూ.20 కంటే తక్కువ డబ్బులను నిర్ణయించే అవకాశం ఉందని డేటావిండ్ కంపెనీ వర్గాలు చెప్పాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
datawind has plans to invest Rs 100 crore in telecom services business in the first six months of getting a licence and offer data services at Rs 200 per year.
Please Wait while comments are loading...