"అక్రమ సంతానమైనా కూతురు పెళ్లి ఖర్చులు తండ్రివే"

Posted By:
Subscribe to Oneindia Telugu

కోయంబత్తూర్: కూతురు పెళ్లి ఖర్చులు తండ్రి భరించాల్సిందేనని కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తాను సంపాదిస్తున్నా సరే తన వివాహ ఖర్చులు భరించాలని తండ్రిని అడిగే హక్కు కూతురికి ఉంటుందని తేల్చి చెప్పింది.

హిందువైన ఆమె తల్లి సంపాదిస్తున్నా సరే అవివాహిత కూతురి పెళ్లి ఖర్చులు తండ్రి భరించాలని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం వల్ల పుట్టిన కూతురు వివాహం ఖర్చులు కూడా భరించాలని చెప్పింది.

Daughter can ask father to pay for marriage: Kerala HC

కోయంబత్తూరుకు చెందిన అంబిక అరవిందాక్షణ్ చేసిన అప్పీలుపై న్యాయస్థానం తీర్పు వెలువరించింది. తన పెళ్లి ఖర్చులు భరించడానికి తన తండ్రి ముందుకు రావడం లేదని ఆరోపిస్తూ అంబిక పాలక్కాడ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

తన తండ్రి నుంచి రూ.5 లక్షలు ఇప్పించాలని ఆమె కోర్టును కోరింది. అంబిక, ఆమె తల్లికి ఇంటి అద్దెల ద్వారా నెలకు రూ.12 వేల ఆదాయం వస్తోందని, అందువల్ల తండ్రి నుంచి పెళ్లి ఖర్చులకు డబ్బు అడగడం సరికాదని కుటుంబ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అంబిక కేరళ హైకోర్టుకు ఎక్కింది. ఆమె అప్పీలుపై విచారణ జరిపిన హైకోర్టు కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. వారికి వస్తున్న రూ.12 వేల ఆదాయాన్ని చూపించి కేసును కొట్టివేయడం సరికాదని అభిప్రాయపడింది.

రూ. 12 వేలు అవసరాలకు సరిపోవని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ 1987లో కరుణాకరన్ నాయర్ Vs సుశీల అమ్మ కేసులో ఇచ్చిన తీర్పును హైకోర్టు ఉటంకించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Hindu unmarried daughter has the right to obtain expenses for her intended marriage from her father even if the daughter and her mother have other income, the Kerala High Court has held.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి