Daughter: కాలేజ్ అమ్మాయికి అంబులెన్స్ డ్రైవర్ బాయ్ ఫ్రెండ్, పెళ్లిచూపుల ముందురోజు ?

చెన్నై/తిరునల్వేలి: కాలేజ్ కు వెలుతున్న యువతికి ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కొంతకాలం తరువాత ప్రియురాలి లవ్ మ్యాటర్ ఆమె తల్లికి తెలిసిపోయింది. కూతురు చెయ్యిదాటి పోతుందని తల్లి పెళ్లి సంబంధాలు చూసింది. తనకు పెళ్లి చెయ్యాలని చూస్తే నా ప్రియుడితో లేచిపోతానని, తరువాత నీ పరువు పోతుందని కొంతకాలం కూతురు ఆమె తల్లిని బెదిరిస్తూ వస్తోంది. కూతురు లేచిపోతే పరువుపోతుందని తల్లి భయపడింది. కూతురు హత్యకు గురైయ్యింది. అదే సమయంలో తల్లి ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో అందరూ హడలిపోయారు.

 నర్సింగ్ కాలేజ్ అమ్మాయి

నర్సింగ్ కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని శిలపెరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమడై నెల్లూరులో అర్ముగగని అనే మహిళ నివాసం ఉంటున్నది. అర్ముగగని కుమార్తె అరుణ (19) అనే యువతి కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుకుంటున్నది.

 అంబులెన్స్ డ్రైవర్ తో అమ్మాయి లవ్

అంబులెన్స్ డ్రైవర్ తో అమ్మాయి లవ్

నర్సింగ్ కాలేజ్ అమ్మాయి అరుణకు చెన్నైలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్న బాచి యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత కాలేజ్ అమ్మాయి అరుణ డ్రైవర్ బాచి ప్రేమలో పడింది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న అరుణ ఆమె ప్రియుడు బాచితో తిరుగుతూ ఎంజాయ్ చేసింది.

 ప్రియుడితో లేచిపోతానని ?

ప్రియుడితో లేచిపోతానని ?

కొంతకాలం తరువాత అరుణ లవ్ మ్యాటర్ ఆమె తల్లి అర్ముగగనికి తెలిసిపోయింది. కూతురు అరుణ చెయ్యిదాటి పోతుందని ఆమె తల్లి అర్ముగగని పెళ్లి సంబంధాలు చూసింది. తనకు పెళ్లి చెయ్యాలని చూస్తే నా ప్రియుడితో లేచిపోతానని, తరువాత నీ పరువు పోతుందని కాలేజ్ అమ్మాయి అరుణ ఆమె తల్లి అర్ముగనిని బెదిరిస్తూ వస్తోంది.

 కాలేజ్ అమ్మాయికి పెళ్లిచూపులు ముందురోజే కూతర్ని చంపేసిన తల్లి

కాలేజ్ అమ్మాయికి పెళ్లిచూపులు ముందురోజే కూతర్ని చంపేసిన తల్లి

కాలేజ్ లో చదువుతున్న కూతురు అరుణ తక్కువ కులం వాడితో, ఓ డ్రైవర్ తో లేచిపోతే పరువుపోతుందని ఆమె తల్లి అర్ముగగని భయపడింది. బుధవారం అరుణను చూడటానికి పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు వస్తామని చెప్పారు. ఇదే విషయంలో మంగళవారం రాత్రి అరు, ఆమె తల్లి ఆర్ముగని మద్య పెద్దగొడవ జరిగింది.

 కూతర్ని చంపేసిన తల్లి ఏంచేసిందంటే ?

కూతర్ని చంపేసిన తల్లి ఏంచేసిందంటే ?

ఆ సందర్బంలో ఆర్ముగగని ఆమె కూతరు అరుణను గొంతు నులిమి చంపేసి ఆమె నిద్రమాత్రలు మింగేసి ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు ఆర్ముగగని ఆసుపత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలతో భయపడింది. పెళ్లి చూపుల ముందురోజే కాలేజ్ అమ్మాయి ఆమె తల్లి చేతిలో హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+