మాజీ సీఎం ఎలా గెలుస్తారో మేము చూస్తాం, బ్లాక్ మెయిల్ చెయ్యడం ఆయనకు అలవాటు, రేట్లు ఫిక్స్ !

మాజీ సీఎం కుమారస్వామికి రేటు ఫిక్స్ చెయ్యడం, దేనికి ఏ రేటు అని డిసైడ్ చెయ్యడంలో మేధావి అని, ఇప్పుడు వేరేవాళ్లు రేట్ ఫిక్స్ చేస్తున్నారని మామీద నిందలు వేస్తున్నారని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. మీరు వేరొకరిపై నిందలు వేస్తున్నారని, నిందలు వేసే ముందు వెనుకా ముందు ఆలోచించాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామికి కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ సూచించారు.

డీకే శివకుమార్‌ మహిళలకు రేట్లు ఫిక్స్‌ చేస్తున్నారని, ప్రభుత్వం గ్యారెంటీల ద్వారా ప్రజల జేబులకు చిల్లు పెడుతుందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ సమాధానమిస్తూ హెచ్ డీ కుమారస్వామికి పిక్‌ పాకెట్‌ చేసిచేసి అలవాటు అయిపోయిందని, ఇప్పుడు అదే డైలాగ్ ఇతరుల మీదకు నెట్టి భయపెట్టి బ్లాక్‌మెయిల్‌లు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

DCM DK Shivakumar is saying that he will defeat former CM Kumaraswamy in Mandya

లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న తరువాత బీజేపీ నాయకులు కాంగ్రెస్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో జేడీఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎలాగైనా ఓడించాలని బీజేపీ, జేడీఎస్ పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.

మండ్యలో ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ సీఎం కుమారస్వామిని ఓడిస్తామని కాంగ్రెస్ నాయకులు చాలెంజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మాజీ సీఎం, జేడీఎస్ దళపతి హెచ్ డీ కుమారస్వామిని టార్గెట్ చేస్తూ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మండ్యలో కుమారస్వామి ఎలా గెలుస్తారో మేము చూస్తామని ఇప్పటికే సిద్దరామయ్య, డీకే శివకుమార్ బహిరంగంగా మాట్లాడారు. మండ్యలో గెలుపే లక్షంగా కుమారస్వామి, జేడీఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు.

ఇప్పుడు ప్రజల సొత్తు ఎవరు లూటీ చేస్తున్నారు అని కర్ణాటకలోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సీఎం కుమారస్వామి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో వీలైనంత మంది జేడీఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద డీకే శివకుమార్, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మాటల యుద్దం తారాస్థాయికి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+