గంభీర్‌కు ISIS Kashmir నుంచి ప్రాణగండం
ISIS Kashmir: పహల్గామ్‌లో ఉగ్రదాడి చోటు చేసుకున్న అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా రెడ్ అలర్ట్ జారీ అయింది. భద్రత సిబ్బంది, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు.
అదే సమయంలో బారాముల్లా సమీపంలోని యూరీ సెక్టార్ వద్ద భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులను దాటుకుని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఇద్దరు చొరబాటుదారులను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మారణాయులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ పరిస్థితుల మధ్య భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ (ISIS) ఐసిస్.. భారత్‌లో అడుగు పెట్టినట్టే కనిపిస్తోంది. సిరియా, ఇరాక్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని గతంలో ప్రపంచదేశాలను వణకించిన ఐసిస్ ఛాయలు భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్‌పై పడిందనే అనుమానాలు బలంగా వ్యక్తమౌతోన్నాయి.
భారత క్రికెట జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కాశ్మీర్ యూనిట్ నుంచి ప్రాణహాని ఏర్పడమే దీనికి ఉదాహరణ. ఐసిస్ కాశ్మీర్ నుంచి గంభీర్ ప్రాణాలకు ముప్పు పొంచివుంది. ఈ సంస్థ నుంచి బెదిరింపులు అందాయి. దీనితో ఆయన హుటాహుటిన ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. రాజీందర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ విజ్ఞప్తి చేశారు. IKillU అంటూ ఈ నెల 22వ తేదీన రెండు ఇమెయిల్స్ అందాయి గౌతమ్ గంభీర్‌కు. తొలి ఇమెయిల్ ఆ రోజు మధ్యాహ్నం అందింది. సాయంత్రానికి మరో మెయిల్ అందింది. ఈ రెండింట్లో కూడా IKillU అనే అక్షరాలే ఉన్నాయి.
గంభీర్ ఫిర్యాదు అనంతరం దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ సెంట్రల్ డీసీపీ తెలిపారు. సైబర్ వింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు. ఈ ఇమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?, దాని ఐపీ అడ్రస్ ఏమిటీ? ఐసిస్ కాశ్మీర్ మూలాలు ఎక్కడ ఉన్నాయి? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications