Karnataka Judges : కర్నాటక హైకోర్టులో ఆరుగురు జడ్డీలకు బెదిరింపులు-50 లక్షలివ్వకపోతే ..

కర్నాటకలో తాజాగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తులకు వ్యక్తిగతంగా చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్ లు వెళ్లాయి. ఓ పాకిస్తానీ బ్యాంక్ లో ఖాతాకు రూ.50 లక్షలు డిపాజిట్ చేయకపోతే జడ్డీల్ని చంపేస్తామంటూ ఈ మెసేజ్ ల సారాంశం. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నాటక పోలీసులు దీనిపై వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

తనతో సహా పలువురు న్యాయమూర్తుల ప్రాణాలకు బెదిరింపులు ఉన్నాయని కర్ణాటక హైకోర్టు ప్రెస్ రిలేషన్స్ అధికారి ఫిర్యాదు చేయడంతో స్ధానిక సెంట్రల్ సీఈఎన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గుర్తు తెలియని అనుమానితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జూలై 12న రాత్రి 7 గంటల సమయంలో అంతర్జాతీయ నంబర్ నుండి వాట్సాప్ మెసెంజర్‌లో ఆయనకు సందేశాలు వచ్చాయి. ఆయన మొబైల్ నంబర్ అధికారికంగా హైకోర్టు ఇచ్చిందే.

death threats to six karnataka hc judges, sender demands rs.50 lakhs

హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో వచ్చిన సందేశంలో మురళీధర్‌తో పాటు హైకోర్టులోని జస్టిస్ మహ్మద్ నవాజ్, జస్టిస్ హెచ్‌టి నరేంద్ర ప్రసాద్, జస్టిస్ అశోక్ జి నిజగన్నవర్ (రిటైర్డ్), జస్టిస్ హెచ్‌పి సందేశ్, జస్టిస్ కె నటరాజన్, జస్టిస్ బి వీరప్ప (రిటైర్డ్) సహా ఆరుగురు హైకోర్టు జడ్జిలను 'దుబాయ్ గ్యాంగ్' ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.ఈ మెసేజ్ లో మొత్తం ఐదు అనుమానాస్పద మొబైల్ ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని వెల్లడించారు.

ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంపై జులై 14న నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పాకిస్థాన్‌లోని బ్యాంకు ఖాతాకు రూ.50 లక్షలు చెల్లించాలని బెదిరింపు మెసేజ్ లో ఆగంతకులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 506, 507, 504, ఐటీ చట్టంలోని సెక్షన్లు 75, 66(ఎఫ్) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం పోలీసులు దానిని 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+