వచ్చే వారం కోవాగ్జిన్ అత్యవసర వినియోగంపై నిర్ణయం: ప్రపంచ ఆరోగ్య సంస్థ

న్యూఢిల్లీ/జెనీవా: భారత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా(ఈయూఏ)లో చేర్చాలన్న అంశంపై వచ్చే వారంలో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది.

డబ్ల్యూహెచ్ఓ, స్వతంత్ర నిపుణుల బృందం వచ్చే వారంలో భేటీ అవుతుందని, కోవాగ్జిన్ టీకా మూడు దశల క్లినికల్ ట్రయల్స్ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలను సమీక్షించి అత్యవసర వినియోగ జాబితాలో చేర్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి డబ్ల్యూహెచ్ఓ ట్విట్టర వేదికగా వెల్లడించింది.

 Decision On Covaxin Clearance Next Week: WHO

కోవాగ్జిన్ టీకాకు సంబంధించి ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ ఏప్రిల్ నెలలో ఈవోఐ(ఎక్ప్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్) సమర్పించింది. ఈ క్రమంలో జులై 6న వ్యాక్సిన్ డేటా రోలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు కూడా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈయూఏలో చేర్చేందుకు కోవాగ్జిన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓకు ఇప్పటికే సమర్పించామని, ఆ సంస్థ ఫీడ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నట్లు భారత్ బయోటెక్ ఇటీవల ప్రకటించింది. కాగా, మనదేశంలో కోవాగ్జిన్‌ను అత్యవసర వినియోగం కింద ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. కోవాగ్జిన్ తోపాటు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ టీకాను పంపిణీ చేస్తున్నారు.

ఇది ఇలావుండగా, భారతదేశంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 18,346 కొత్త కేసులు నమోదయ్యాయి. 209 రోజుల తర్వాత తాజాగా నమోదైన కేసులు అత్యల్పంగా నమోదైన కేసులుగా ఉన్నాయి.ఇదిలా ఉంటే కరోనా యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,52,902 గా ఉంది. కరోనా యాక్టివ్ కేసుల శాతం 0.75 శాతం గా ఉంది. తాజాగా 263మంది కరోనా కారణంగా మృతి చెందారు.ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4,49,260 కరోనా మరణాలు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కనీసం 29,639 రికవరీలు నమోదు కాగా, భారతదేశంలో మొత్తం రికవరీల సంఖ్య 3,31,50,886 కి చేరాయి. రికవరీ రేటు ప్రస్తుతం 97.93% గా ఉందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది. కరోనా కొత్త కేసుల కంటే రోజువారీ రికవరీలు పెరగటం కాస్త ఊరటనిస్తున్న అంశం .అక్టోబర్ 4 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 57,53,94,042 కాగా, నిన్న ఒక్క రోజే 11,41,642 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.

Recommended Video

    గణేష్ నిమజ్జనోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్న భక్తులు!!

    భారతదేశంలోని పెద్దలకు డెబ్భై శాతం మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క మొదటి డోస్ ఇవ్వబడినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అధికారుల ప్రకారం, పెద్దలకు 25 శాతం మందికి రెండు మోతాదులు ఇవ్వబడ్డాయి. దేశంలో ఇప్పటివరకు 91.54 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వబడ్డాయి. ఇదిలా ఉంటే రోజువారీ పాజిటివిటీ రేటు1.61 శాతంగా ఉంది. గత 36 రోజులలో 3 శాతం కంటే తక్కువగా ఉంది. భారతదేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 1.66 శాతంగా ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+