పరువు నష్టం దావా: కెప్టెన్ విజయ్‌కాంత్‌కు ఊరట
చెన్నై: పరువు నష్టం దావాలో ఎండిఎంకె నేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌కు ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం నమక్కల్ కోర్టులో ఆయనపై పరువు నష్టం దావా వేసింది.
ఇది వరకు కూడా అటువంటి మినహాయింపులు ఇచ్చిన సందర్భాలు ఉండడంతో జస్టిస్ ఆర్ సుధాకర్, కెకె సుదర్శన్‌లతో కూడిన మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ విజయ్‌కాంత్ పిటిషన్‌ను అనుమతిస్తూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.

తదుపరి ఆదేశాలు అందే వరకు పిటిషనర్‌కు ఇచ్చిన మినహాయింపు అమలులో ఉంటుందని కోర్టు తెలియజేస్తూ ఈ రిట్ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లను వేసవి సెలవుల తర్వాత చేపట్టనున్నట్లు తెలిపింది.
ముఖ్యమంత్రి జయలలితపై పెండింగులో ఉన్న కేసులపై విజయ్‌కాంత్ 2012 ఆగస్టు 17వ తేదీన ఓ బహిరంగ సభలో విమర్శలు చేశారు. దానిపై సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమక్కల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ దావాలో జూన్ 3వ తేదీన హాజరు కావాలని నమక్కల్ కోర్టు విజయ్‌కాంత్‌కు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications