నితీశ్ ప్రమాణ స్వీకారం: రాహుల్ ఆలస్యానికి కారణం!
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఐదోసారి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని అతిరథులంతా హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడా కనిపించలేదు.
విమాన ఆలస్యం కారణంగానే ప్రమాణ స్వీకారానికి ఆలస్యంగా హాజరైనట్లు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. "ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, దానికి సంబంధించిన కారణాల వల్ల గంటకు పైగా ఫ్లైట్ ఆలస్యం అయింది. ఇప్పుడే పాట్నాలో లాండ్ అయ్యాను. గాంధీ మైదాన్‌కు వెళుతున్నా" అని రాహుల్ మూడు గంటల సమయంలో ట్వీట్ చేశారు.
Flight delayed by more than an hour due to air traffic control & related issues. Just landed in Patna! On my way to Gandhi Maidan now
— Office of RG (@OfficeOfRG) November 20, 2015 బిహార్‌లో మహాకూటమి విజయం తర్వాత రాహుల్‌లో పెరిగిన ఉత్సాహం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు 27 స్థానాల్లో గెలిచి ఆ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపారు. మధ్యాహ్నాం 2 గంటల సమయంలో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.
నితీశ్ కుమార్ ప్రమాణస్వీకార మహోత్సవానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ బీజేపీ లీడర్ సుశీల్ కుమార్ మోడీ, హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ తదితరులు హాజరయ్యారు. వెంకయ్య నాయుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పక్కనే కూర్చున్నారు.

రెండు లక్షల మంది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్ బీహార్ లో 41 స్థానాల్లో పోటీచేసి 27 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications