ఢిల్లీ ఉగ్రవాద కుట్రలో ప్రేమకథ ట్విస్ట్!
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా, ఆత్మాహుతి బాంబర్‌గా భావిస్తున్న డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అలియాస్ మహ్మద్ ఉమర్ వ్యక్తిగత జీవితం, దానితో సంబంధం ఉన్న వ్యక్తుల చుట్టూ దర్యాప్తు సాగుతోంది. ఈ దర్యాప్తు డాక్టర్ మహ్మద్ ఉమర్ ప్రియురాలి(మంగేతర్) ఇంటి వరకు చేరుకుంది. ఆమె కూడా వృత్తిరీత్యా డాక్టరే. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె ఇంటి నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాకు చెందిన మహ్మద్ ఉమర్ పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలోనే కారు పేలుడులో ఆత్మాహుతికి పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
డాక్టర్ ఉమర్ ఉన్ నబీ - మంచి వ్యక్తిగా పరిచయం
ఢిల్లీ పేలుడులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఉమర్.. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, కోయిల్ గ్రామానికి చెందినవాడు. మహ్మద్ ఉమర్ చాలా తెలివైన విద్యార్థి. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి ముందు అతను శ్రీనగర్‌లోని ప్రతిష్టాత్మక SMHS ఆస్పత్రి, అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో డాక్టర్‌గా పనిచేశాడు. కోయిల్ గ్రామం శ్రీనగర్ నుంచి 35 కి.మీ దూరంలో ఉంది. ఉమర్‌కు గ్రామంలో మంచి పేరు ఉండటం వల్ల అతని చర్యలను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

వివాహానికి సిద్ధమవుతున్న కుటుంబం
మహ్మద్ ఉమర్ కుటుంబ సభ్యులు మంగళవారం (నవంబర్ 11, 2025) పోలీసు విచారణ కోసం డీఎన్ఏ నమూనాల సేకరణ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఇంట్లో అతని గర్భిణీ వదిన ముజమ్మిల్ మాత్రమే మిగిలి ఉంది. "మహ్మద్ ఉమర్ మాకు ప్రధాన ఆదాయ వనరు, ఆశాకిరణం" అని ముజమ్మిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. "మేము శుక్రవారమే మధ్యాహ్నం అతడితో మాట్లాడాము. అతను చాలా సరదాగా మాట్లాడేవాడు. తన చదువు గురించి చెప్పేవాడు. మేము అతనికి వివాహం చేయడానికి సిద్ధమవుతున్నాం" అని ఆమె అన్నారు.
యూపీఎస్సీకి సిద్ధమవుతున్న ప్రియురాలు
ఉమర్ నబీ నిశ్చితార్థం కూడా శ్రీనగర్‌లోని హైదర్పురాకు చెందిన డాక్టర్ తోనే జరిగింది. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ అయిన ఆమె ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఉమర్ వదిన మరొక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. శుక్రవారం ఉమర్ స్వయంగా ఫోన్ చేసి "నేను బాగానే ఉన్నాను" అని చెప్పాడని, ఇంటికి రమ్మని తాను అడిగితే.. "నాకు పరీక్ష ఉంది, నేను లైబ్రరీకి వెళ్తాను" అని చెప్పాడని వివరించింది.
అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసే డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్ట్ గురించి ఉమర్‌కు తెలియజేయగా.. తాను ఈ విషయం గురించి ఏమీ తెలియదని ఉమర్ చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే శనివారం (నవంబర్ 8, 2025) నుండి ఉమర్ తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులు ఉమర్ ఇంటి నుంచి, అతని ప్రియురాలి ఇంటి నుండి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ సహా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications