రాహుల్ గాంధీకి ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు: లైంగిక వేధింపుల వ్యాఖ్యల ఎఫెక్ట్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసానికి భారీగా ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. మహిళలపై ఇంకా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసానికి భారీగా ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. మహిళలపై ఇంకా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ విషయంపై ఆయన నుంచి స్పందన రాకపోవడంతో, స్పష్టత తీసుకోవడానికి పోలీసులు ఆదివారం రాహుల్ ఇంటికి వెళ్లారు.

స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(శాంతి భద్రతలు) సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలో పోలీసుల బృందం తుగ్లక్ లేన్‌లో ఉన్న రాహుల్ నివాసానికి చేరుకుంది. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఆయనకు ఒక ప్రశ్నావళి పంపినట్లు పోలీసులు తెలిపారు. లైంగిక దాడులు ఎదుర్కొంటున్నామంటూ ఆయన్ని సంప్రదించిన మహిళలెవరో చెప్పాలని కోరినట్లు తెలిపారు. తద్వారా ఆ మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

కాగా, వివరాలు ఇచ్చేందుకు రాహుల్ తనకు కొంత సమయం కావాలని చెప్పారని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ ప్రత్ హుడా తెలిపారు.

 Delhi cops At Rahul Gandhis House Regarding His Remark On Sexual Assault Survivors

ఈ వ్యవహారంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్‌లో మహిళల లైంగిక దాడుల అంశాన్ని ప్రస్తావించారు. యాత్రలో భాగంగా తనని కొంత మంది మహిళలు కలిశారని.. ఇప్పటికీ తాము లైంగిక దాడులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ఆ విధంగా రాహుల్ గాంధీని ఆశ్రయించినవారి జాబితాను తమకు ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ అంశంపై సమాచారాన్ని సేకరించేందుకు మార్చి 15న ప్రయత్నించామని, అప్పుడు విఫలమయ్యామని పోలీసులు చెప్పారు. మార్చి 16న రాహుల్ కు నోటీసు పంపించామని తెలిపారు.

మరోవైపు, రాహుల్ గాంధీకి నోటీసులు ఇవ్వడం, ఇంటికి రావడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ ఇంటికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. పోలీసుల రాకపై నిరసన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+