అరవింద్ కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడు, దేశభక్తి పేరుతో బీజేపీ మోసం చేస్తోంది: ఆప్ నేత రాఘవ్
హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఊడ్చేసింది. బీజేపీ, కాంగ్రెస్.. ఏ ఇతర పార్టీకి అవకాశం ఇవ్వకుండా చేసింది. 63 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ దెబ్బకు బీజేపీ సహా ఇతర పార్టీల పరిస్థితి చావుతప్పి కన్నులొట్టబోయినా చందంగా మారింది. ఇవాళ కేజ్రీవాల్ సతీమణి సునీత పుట్టినరోజు కూడా.. ఓకే రోజు రెండు పండగలు ఆప్ నేతలకు వచ్చినట్టుంది.
కేజ్రీవాల్ దేశభక్తుడు..
ఢిల్లీలో ప్రచార పర్వం పీక్ స్టేజీకి చేరిన క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌ను బీజేపీ ఉగ్రవాదిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆప్ నేత రాఘవ్ చద్దా స్పందించారు. రాజిందర్ నగర్‌లో 20 వేల మెజార్టీతో గెలుపొందిన తర్వాత ర్యాలీ తీశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవల్ నిజమైన దేశ భక్తుడు అని చెప్పారు.

దేశభక్తి పేరుతో మోసం..
కేజ్రీవాల్ దేశభక్తుడనే విషయాన్ని ఢిల్లీ ప్రజలు నిరూపించారని గుర్తుచేశారు. కేజ్రీవాల్ దేశ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని.. కేజ్రీవాల్ చేసే పని దేశభక్తికి నిదర్శనం అని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం దేశభక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకొని ఓ దేశభక్తుడిలా కేజ్రీవాల్ పనిచేస్తున్నారని కొనియాడారు. కానీ బీజేపీ అలా కాదని ధ్వజమెత్తారు.

63 చోట్ల
ఢిల్లీలో ఆప్ 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 37 చోట్ల ఇప్పటికే విజయం సాధించింది. బీజేపీ 7 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 4 చోట్ల మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం విశేషం. ఢిల్లీలో వార్ వన్ సైడ్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications