రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ఒలింపిక్ విజేతకు రూ.7 కోట్లు
2036 ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఆ విషయాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఓ లేఖను సమర్పించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఈ విశ్వ క్రీడలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్ అంతర్జాతీయ ఈవెంట్ లో పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు, అథ్లెట్లకు నగదు బహుమతిని భారీగా పెంచేసింది. ఇప్పటి వరకు ఒలింపిక్ క్రీడల విజేతలకు 3 కోట్లు, 2 కోట్లు, 1 కోటి రూపాయలు ఇచ్చేవారు. అయితే తాజాగా దిల్లీ తరఫున ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన విజేతకు రూ.7 కోట్లు నజరానాను ప్రకటించారు. అంతేకాదు బంగారు పతకం సాధించిన అథ్లెట్లకు గ్రూప్ ఏ ఉద్యోగాలు కూడా లభించనున్నాయి.
దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాస్ ఏంజిల్స్ లో 2028 లో జరగబోయే ఒలింపిక్స్ క్రీడల్లో విజయం సాధించిన వారికి నగదు బహుమతిని భారీగా పెంచేసింది. ముఖ్యమంత్రి ఖేల్ ప్రోత్సాహన్ యోజన కింద దిల్లీ ప్రభుత్వం తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. దిల్లీ తరపున ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన విజేతకు రూ.7 కోట్లు నజరానాను ప్రకటించింది. అంతేకాక బంగారు పతకం సాధించిన అథ్లెట్లకు గ్రూప్ A ఉద్యోగాలు లభించనున్నాయి. అంతేకాక 10వ తరగతి బోర్డు పరీక్షలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల 1200 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్‌లను అందించాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి ఖేల్ ప్రోత్సాహన్ యోజన కింద సిల్వర్ మెడల్ విజేతలకు రూ. 5 కోట్లు.. కాంస్య పతక విజేతలకు రూ. 3 కోట్లు అందజేయనున్నారు. సిల్వర్, కాంస్య విభాగాల్లో విజయం సాధించిన వారికి గ్రూప్ B ఉద్యోగాలు లభించనున్నాయి. గతంలో ఒలింపిక్, పారాలింపిక్ పతక విజేతలకు గోల్డ్ మెడల్ విజేతకు రూ. 3 కోట్లు, సిల్వర్ మెడల్ విజేతకు రూ.2 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ. 1 కోటి చొప్పున బహుమతి ఇచ్చేవారు.

మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల మాట్లాడుతూ.. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్ సన్నాహాలు మొదలుపెట్టిందని తెలిపారు. ఇందుకోసం సుమారు 3,000 మంది క్రీడాకారులకు ఒకొక్కరికి నెలకు రూ.50,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2036 విశ్వ క్రీడల్లో టాప్-5లో నిలవడమే లక్ష్యంగా సాగుతున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications