Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Blinkit: కత్తులు ఆర్డర్ చేస్తున్నారా? కేసు పెడతారు!

ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో నిత్యావసరాలు డెలివరీ చేసే 'బ్లింకిట్' (Blinkit) ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ చేసిన వాటిని పంపే వేగంతో, ఏకంగా నిషేధిత మారణాయుధాలను పోలీస్ స్టేషన్‌కే డెలివరీ చేసి పోలీసులకు దొరికిపోయింది. పశ్చిమ ఢిల్లీలోని ఖయాలా పోలీసులు చేపట్టిన ఈ 'స్టింగ్ ఆపరేషన్' ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఖయాలా ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు వరుస హత్యలు పోలీసులను ఉలిక్కిపడేలా చేశాయి. నిందితులు హత్యలకు ఉపయోగించిన కత్తులను ఎక్కడ కొన్నారని ఆరా తీయగా, అవి ఆన్‌లైన్ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా డెలివరీ అయినట్లు తేలింది. దీంతో రంగంలోకి దిగిన వెస్ట్ ఢిల్లీ డీసీపీ దరడే శరద్ భాస్కర్ బృందం, ఈ ప్లాట్‌ఫారమ్‌ల గుట్టు రట్టు చేయాలని నిర్ణయించుకుంది.

Delhi Police Files FIR Against Blinkit for Selling Illegal Knives 50 Weapons Seized in Sting Operation

పోలీస్ స్టేషన్‌ నుంచే Blinkit లో ఆర్డర్..

బ్లింకిట్ నిజంగానే నిషేధిత ఆయుధాలను అమ్ముతుందో లేదో పరీక్షించడానికి ఫిబ్రవరి 13న ఒక కానిస్టేబుల్ పక్కా ప్లాన్ వేశారు. మధ్యాహ్నం 3:43 గంటలకు రూ. 710 చెల్లించి ఆన్‌లైన్‌లో ఒక కత్తిని ఆర్డర్ చేశారు. డెలివరీ అడ్రస్ కింద ఏకంగా 'ఖయాలా పోలీస్ స్టేషన్ సెకండ్ ఫ్లోర్' అని ఇచ్చారు. సాయంత్రం 4:05 గంటలకు అంటే ఆర్డర్ చేసిన కేవలం 22 నిమిషాలకే.. సదరు కత్తి స్టేషన్ ఆవరణలో డెలివరీ అయ్యింది. పోలీస్ స్టేషన్‌కే ఆయుధాన్ని పంపేంత తెగింపు చూసి పోలీసులు విస్తుపోయారు.

నియమాలను తుంగలో తొక్కి..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 7.62 సెం.మీ పొడవు, 1.72 సెం.మీ వెడల్పు మించిన బ్లేడ్ ఉన్న కత్తులను అమ్మడం నేరం. కానీ, బ్లింకిట్ పంపిన 'గరారిదార్' రకం కత్తి బ్లేడ్ 8 సెం.మీ పొడవు, 2.5 సెం.మీ వెడల్పు ఉంది. ఇది పక్కాగా చట్టవిరుద్ధమైన ఆయుధమని నిర్ధారించిన పోలీసులు, వెంటనే ఆయుధాల చట్టంలోని సెక్షన్లు 25, 54, 59 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

డార్క్ స్టోర్లపై దాడులు.. 50 కత్తుల సీజ్!

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని వివిధ 'డార్క్ స్టోర్ల' నుండి 16 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హర్యానాలోని గురుగ్రామ్, ఫరూఖ్‌నగర్‌లలో ఉన్న బ్లింకిట్ మెయిన్ గిడ్డంగులపై దాడులు చేసి మరో 32 కత్తులను సీజ్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 50 నిషేధిత కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంపై బ్లింకిట్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. చట్టవిరుద్ధమైన ఆయుధాల నిల్వ, పంపిణీ వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+