Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Delhi Polls: గతం మరచిన కేజ్రివాల్ ఇదొక్కటే చెప్తా..అన్నా హజారే షాకింగ్ ..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకీ, విపక్ష బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు పార్టీలూ పరస్పరం ఆధిక్యం ప్రదర్శించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలో ఒకప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్నా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఢిల్లీ ఎన్నికల్లో మూడోసారి గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్న ఒకప్పటి తన శిష్యుడి అరవింద్ కేజ్రివాల్ కు ఏమైనా సలహాలు ఇస్తారా అన్న ప్రశ్నకు అన్నా హజారే ఘాటుగా స్పందించారు. కేజ్రివాల్ గతంలో తాను ఇచ్చిన సూచనలను మర్చిపోయి డబ్బు కోసం పరిగెత్తాడని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు నేను ఆయనకు ఏం సూచనలు ఇస్తానంటూ అన్నా హజారే ప్రశ్నించారు. ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్న రోజుల్లో తాను ఇచ్చిన ఇచ్చిన సూచనలను అతనికి గుర్తు చేయాలనుకుంటున్నాను అంటూ హజారే నిర్వేదంగా చెప్పారు.

Delhi Polls anna hazare slams Arvind Kejriwal for ignoring his suggestions

కేజ్రివాల్ తీరుపై స్పందిస్తూ.. ఇది దురదృష్టకరం అన్నారు. అతను తనతో పాటు వాలంటీర్‌గా ఉన్నాడని, జీవితంలో నీ ప్రవర్తన, అభిప్రాయాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని తాను అతనికి ఎప్పుడూ చెబుతుంటానని అన్నా గుర్తుచేసుకున్నారు. మీ జీవితాన్ని నిర్మలంగా ఉంచుకోండి, త్యాగాలు చేయడం నేర్చుకోండి అని అన్నా సూచించారు. ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడవండని కోరారు. కానీ అతని(కేజ్రివాల్ ) మనసులో డబ్బు ఉందన్నారు. తద్వారా ఇప్పుడు తాను ఏం చెప్పినా పట్టించుకునే పరిస్ధితి లేదని అన్నా హజారే చెప్పకనే చెప్పేశారు.

70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి ఓట్ల లెక్కింపు 7వ తేదీన జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో బీజేపీపై ఆప్ మరోసారి ఆధిక్యంలో ఉందని పలు సర్వేలు తేల్చిచెప్పేశాయి. అయితే సీట్ల సంఖ్య మాత్రం గతంలో కంటే తగ్గవచ్చని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నా వ్యాఖ్యల ప్రభావం ఆప్ పై ఉంటుందో లేదో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+