ఢిల్లీ అల్లర్లు: జేఎన్‌యూ పీహెచ్‌డీ స్కాలర్ షార్జిల్ ఇమామ్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ఈ అల్లర్లకు సంబంధం ఉన్న జేఎన్‌యూ పీహెచ్‌డీ స్కాలర్ షార్జిల్ ఇమామ్‌ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం సోమవారం అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రొడక్షన్ వారెంట్ మీద ఇతడ్ని అస్సాం నుంచి ఢిల్లీకి తిరిగి తీసుకొచ్చారు.
దేశ సౌర్వభౌమత్వం, సమగ్రతకు భంగం కలిగించే జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన షార్జిల్ ఇమామ్ పై ఏప్రిల్ నెలలోనే ఢిల్లీ పోలీసులు ఛార్జీషీటు నమోదు చేశారు. ఇమామ్.. దేశ రాజ్యాంగాన్ని బహిరంగంగా ధిక్కరించడంతోపాటు రాజ్యాంగాన్ని ఓ ఫాసిస్ట్ పత్రం అని పేర్కొన్నాడని ఛార్జీషీటులో పోలీసులు పేర్కొన్నారు.

గత ఏడాది సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న ఇమామ్.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. దీంతో అతడ్ని గౌహతి జైల్లో పెట్టారు. కాగా, ఇతడు జులై 21న కరోనా బారినపడ్డాడు. ఇంతకుముందు జనవరి 28న బీహార్ రాష్ట్రంలోని జహనాబాద్‌లో ఢిల్లీ పోలీసులు షార్జిల్ ఇమామ్‌ను అరెస్ట్ చేశారు. దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు జాతి వ్యతిరేక ప్రసంగాలు చేసిన నేపథ్యంలో అతనిపై పలు కేసులు నమోదు చేశారు.
ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా షార్జిల్ ఇమామ్‌పై దేశ ద్రోహం కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 13, 15 తేదీల్లో జరిగిన జామియా అల్లర్లలోనూ విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన ఇతడ్ని అప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications