డోర్ బెల్ కొట్టి ప్యాంట్ విప్పేసి ఇలా.. షాకైన మహిళ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని తైక్వాండో ట్రైనర్ వ్యవహరించిన తీరు షాకింగ్‌కు గురి చేసింది. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.అంతేకాదు ఆ మహిళపై లైంగిక దాడకి ప్రయత్నం చేశాడు. అయితే ఆ మహిళ మాత్రం తృటిలో ఆ నిందితుడి నుండి తప్పించుకొంది. అంతేకాదు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

న్యూఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతానికి చెందిన తైక్వాండో ట్రైనర్‌గా పనిచేసే వ్యక్తి తనకు తెలిసిన మహిళను కలుసుకొనేందుకు వెళ్ళాడు. డోర్ బెల్ కొట్టాడు. తలుపు దగ్గర నిలబడ్డాడు. ఆ మహిళ వచ్చి తలుపు తీసే సమయానికి తన ప్యాంట్ విప్పేసి అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.

Delhi: Taekwondo trainer rings doorbell, masturbates in front of woman

అయితే డోర్ బెల్ విని తలుపు తీసిన మహిళ తైక్వాండో ట్రైనర్ చేస్తున్న పనికి షాక్‌కు గురైంది. అదే సమయంలో తైక్వాండో ట్రైనర్ ఆ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించారు. అయితే అతడి నుండి ఆమె సురక్షితంగా తప్పించుకొంది. అంతేకాదు గట్టిగా కేకలు వేసింది. దీంతో నిందితుడు తప్పించుకొన్నాడు.

వెంటనే తేరుకొన్న బాధితురాలు పోలీసులకు సమాచారమిచ్చింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. అయితే సీసీటీవిలో రికార్డైన దృశ్యాలను చూసిన పోలీసులు షాకయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, a taekwondo instructor was arrested for molesting and masturbating in front of a woman in New Delhi today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి