వాహనదారులకు అలర్ట్: నవంబర్ 1 నుంచి ఆ వాహనాలకు నిషేధం!

దేశ రాజధాని ఢిల్లీలో చలికాలంలో పెరిగే వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ సర్కారు కఠిన చర్యలు చేపట్టింది. నవంబర్ 1 నుంచి ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన నాన్-బీఎస్6 వాహనాలు(బీఎస్-3, బీఎస్-4 కేటగిరీకి చెందిన పాత వాహనాలు) ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఈ నిషేధం నవంబర్ 1 నుంచి జనవరి 31, 2026 వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

రూ. 6.30 లక్షల ధర.. 35కిలోమీటర్ల మైలేజ్: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫ్యామిలీ కార్!
రూ. 6.30 లక్షల ధర.. 35కిలోమీటర్ల మైలేజ్: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫ్యామిలీ కార్!

కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా 'వింటర్ యాక్షన్ ప్లాన్'ను తీసుకొచ్చినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు నగరంలో ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలలో 50 శాతం 'వర్క్ ఫ్రమ్ హోమ్' అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ట్రాఫిక్ రద్దీ ఒకేసారి పెరగకుండా ఉండేందుకు వివిధ ఆఫీసుల వేళల్లో మార్పులు చేయనున్నారు.

Delhi Winter Action Plan Non-BS6 Vehicles Banned From November 1 50 WFH Announced Full Details Here

ఢిల్లీలో కాలుష్య నియంత్రణను మరింత కఠినతరం చేసేందుకు పకడ్బందీ నిబంధనలను అమలు చేస్తున్నారు. చెల్లుబాటయ్యే కాలుష్య నియంత్రణ పత్రం(పీయూసీసీ) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించకూడదనే 'నో వ్యాలిడ్ PUCC..నో ఫ్యూయల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ఈ కాలంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ-బస్సులు, మెట్రో సేవలు, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించనున్నారు.

పెట్రోల్ కార్లకు ఇక నో ఎంట్రీ? టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!
పెట్రోల్ కార్లకు ఇక నో ఎంట్రీ? టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!

భవన నిర్మాణాలు, కూల్చివేతల వల్ల వచ్చే ధూళి కాలుష్యాన్ని అరికట్టేందుకు నిర్మాణ రంగ పనులపై కూడా ఆంక్షలు విధించారు. సిమెంట్, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి రవాణాపై పరిమితులు ఉంటాయి. నిర్మాణ ప్రాంతాల్లో నిబంధనల ఉల్లంఘనను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించబడిన ఏఐ సాంకేతికతతో కూడిన కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు పౌరులు ప్రభుత్వం తీసుకునే ఈ చర్యలకు సహకరించాలని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+