ఒక్క తొక్కు తొక్కితే బ్రాండ్ న్యూ కారు అప్పడం అయింది

దేశ రాజధానిలోని ఓ మహీంద్రా షోరూమ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన థార్ కారు ప్రమాదానికి గురైంది. అద్దాలు పగులగొట్టుకుని మరీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు గానీ కారు మాత్రం ధ్వంసమైంది. పైఅంతస్తు నుంచి కిందపడటం వల్ల అద్దాలన్నీ పగిలిపోయాయి. ముందు భాగం దెబ్బతింది. కింద పార్క్ చేసి ఉంచిన ఓ బైక్ కూడా మఠాష్ అయింది దీని దెబ్బకు.

ఈస్ట్ ఢిల్లీ ప్రీత్ విహార్‌లో లక్ష్మీనగర్ గల మహీంద్రా షోరూమ్‌లో ఈ సంఘటన సంభవించింది. బ్రాండ్ న్యూ థార్ రాక్స్ ఎస్‌యూవీ మోడల్ కారు అది. దీని ధర దాదాపు 27 లక్షల రూపాయలు. ఈ హై-ఎండ్ ఎస్‌యూవీని మానీ పవార్‌ అనే మహిళ కొనుగోలు చేశారు. ఆమెకు కారును అప్పగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Delhi Woman Crashes Newly Purchased Thar in Shocking Glass wall in Mahindra Showroom

వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత వాటికి పూజలు చేయడం, టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించడం అనేది సాధారణంగా అందరూ పాటించే సంప్రదాయమే. కారును షోరూమ్ సిబ్బంది తన హ్యాండోవర్ చేస్తోన్న సమయంలో కూడా దీనికి పూజలు చేశారు మాని పవార్. బయట కాకుండా షోరూమ్ లోపలే కారు టైర్ల కింద నిమ్మకాయలను పెట్టారు. నెమ్మదిగా కారును ముందుకు కదిపి వాటిని తొక్కాలని భావించారు.

అది విఫలమైంది. అనుకోకుండా బ్రేక్‌కు బదులుగా యాక్సిలేటర్‌ను గట్టిగా తొక్కారావిడ. దీంతో కారు వేగంగా ముందుకు దూసుకెళ్లింది. కన్ను మూసి తెరిచే లోపల ప్రమాదం సంభవించింది. థార్ రాక్స్ కారు షోరూమ్ అద్దాలను పగలగొట్టుకుని, మొదటి అంతస్తు నుండి కిందపడింది. ఈ షాకింగ్ దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో మాని పవార్ తో పాటు వికాస్ అనే షోరూమ్ ఉద్యోగి ఒకరు కారులోనే ఉన్నారు. వారికి స్వల్పంగా గాయాలయ్యాయి.

భళ్లుమంటూ ఫస్ట్ ఫ్లోర్ నుంచి అద్దాలను పగులగొట్టుకుంటూ సినీ ఫక్కీలో కారు దూసుకుని రావడం, కింద బోల్తా పడటాన్ని చూసిన వారు సహాయం చేయడానికి పరుగెత్తారు. కారులో ఉన్న మాని పవార్‌, వికాస్ బయటికి తీశారు. కారు కిందపడ్డ మరుక్షణమే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ఇద్దరికీ పెద్దగా గాయాలేవీ కాలేదు. స్వల్పంగా దెబ్బలు తగిలాయి. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత వారిని డిశ్చార్జ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+