'లెక్క' చెప్తే 50%, లేదంటే 90% పన్ను, మీ డబ్బు 4ఏళ్లకు: జన్ ధన్‌లో కళ్లు తిరిగే డిపాజిట్లు!
జన్ ధన్ యోజన ఖాతాల్లో డిపాజిట్లు నవంబర్ 16 నాటికి రూ.64,252 కోట్లకు పైగా చేరుకున్నాయని కేంద్రం తెలిపింది.
న్యూఢిల్లీ: రద్దు రూ.500, రూ.1000 నోట్లతో డిసెంబర్ 30 వరకూ చేసే బ్యాంకు డిపాజిట్లలో లెక్కలు చెప్పని డబ్బు పైన కనిష్ఠంగా 50% పన్ను విధించే అవకాశముంది. అంతేకాదు, మిగతా సగంలో మరో సగాన్ని నాలుగేళ్ల కాలం పాటు బ్యాంకుల నుంచి విత్ డ్రా చేయకుండా ఆంక్షలు విధించనుంది.
లెక్కలు చూపని డబ్బును స్వచ్ఛందంగా ప్రకటించకుండా, ఆదాయ పన్ను అధికారులే గుర్తిస్తే మాత్రం 90 శాతం వరకూ పన్ను, జరిమానాను పడే అవకాశముంది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టాన్ని కేంద్రం సవరించనుంది. దీనికి కేబినెట్ గురువారం రాత్రి ఆమోదం తెలిపింది.

జన్ ధన్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు
జన్ ధన్ యోజన ఖాతాల్లో డిపాజిట్లు నవంబర్ 16 నాటికి రూ.64,252 కోట్లకు పైగా చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. యూపీ రూ.10,670.62 కోట్లతో జాబితాలో మొదటి స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
యూపీలో 3.79 కోట్ల అకౌంట్ హోల్డర్లు ఉండగా, పశ్చిమ బెంగాల్లో 2.44 కోట్ల అకౌంట్ హోల్డర్లు ఉన్నారు. రాజస్థాన్‌లో 5,345 కోట్లు జమ అయ్యాయి. బీహార్‌లో 4,912 కోట్లు జమ అయ్యాయి. ఇవి నవంబర్ 16వ రకు జమ అయిన మొత్తం. జీరో బ్యాలెన్స్ నిల్వ కలిగిన జన్ ధన్ ఖతాల్లో రూ.1, రూ.2 జమ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించలేదని తెలిపింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications