డేరాబాబా: జైలులో ప్రతిరోజూ రూ.20 వేతనం
రోహ్‌తక్: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ళ జైలుశిక్షను అనుభవిస్తున్న డేరాబాబా రామ్‌రహీమ్ సింగ్ ఇతర ఖైదీల మాదిరిగానే జైలులో పనిచేస్తున్నారు. జైలులో తోటపనిచేస్తూ కూరగాయలు పెంచుతున్నందుకు రామ్‌రహీమ్‌సింగ్‌కు ప్రతిరోజూ రూ.20 వేతనంగా ఇస్తున్నారు డేరాబాబాకు అధికారులు.
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలడంతో అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం రోహ్‌తక్ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. గుర్మీత్ జైలు జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను జైళ్ల శాఖ డీజీపీ కేపీ సింగ్ వివరించారు.
ఇతర ఖైధీల మాదిరిగానే డేరాబాబా కూరగాయలను పండిస్తున్నారని ఆయన చెప్పారు. రోజూ తోట పని చేసి కూరగాయలను పెంచే పనిని అధికారులు ఇచ్చినట్టు డిజిపి చెప్పారు.

. ఎలాంటి నైపుణ్యం లేని వ్యక్తిగా డేరా బాబాను పరిగణించి తోటపనిని అప్పగించారు. పనిచేసినందుకు గాను గుర్మీత్‌కు ఇచ్చే వేతనం రోజుకు రూ.20కి మించడంలేదు. నైపుణ్యంలేని పనులకు హరియాణా జైళ్లలో ఇచ్చే ఫిక్స్‌డ్ వేతనం ఇదేనని డిజిపి చెప్పారు.
టెలివిజన్, వార్తా పత్రికలను సైతం అతడికి అందుబాటులో లేవు. జైలులోని కొన్ని శిబిరాల్లో టీవీ, వార్తాపత్రికలు ఉన్నప్పటికీ గుర్మీత్ ఉండే శిబిరానికి అనుమతి లేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఫోన్ కాల్స్ చేసుకొనేందుకు సైతం వీలులేదని డిజిపి చెప్పారు.
గుర్మీత్‌ను జైలులో ఏకాంతంగా ఉంచారనే ప్రచారాన్ని డీజీపీ తోసిపుచ్చారు. గుర్మీత్ జైలులో ముగ్గురు జీవిత ఖైదీలతో కలిసి ఉంటున్నారన్నారు. బాబా వద్ద ప్రస్తుతం రెండు పుస్తకాలు, రెండు జతల చెప్పులు, ధరించిన దుస్తులు మాత్రమే డిజిపి మీడియాకు చెప్పారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications