డేరాలో అంతేలేని ఘోరాలు: అమ్మాయిల అక్రమ రవాణా, విచ్చలవిడి వ్యభిచారం

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. డేరాలో అమ్మాయిల అక్రమ రవాణా జరిగేదని, విచ్చలవిడి వ్యభిచారం ఇక్కడ సర్వసాధారణమని అధికారులు తేల్చారు.

సిర్సా: హర్యానా, సిర్సా శివార్లలోని డేరా సచ్చా సౌధాలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జరిపిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. డేరాలో అమ్మాయిల అక్రమ రవాణా జరిగేదని, విచ్చలవిడి వ్యభిచారం ఇక్కడ సర్వసాధారణమని అధికారులు తేల్చారు.

ఇక్కడి నుంచి అమ్మాయిలను విదేశాలకు పంపుతూ ఉండేవారని.. దీనికి సంబంధించి తమకు సాక్ష్యాలు లభించాయని, వాటిపై విచారణ ప్రారంభించామని వారు పేర్కొన్నారు. డేరా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు అమ్మాయిలను పంపి వ్యభిచారం చేయించినట్టు కూడా తెలుస్తోందని అన్నారు.

Dera Sacha Sauda - Prostitution, Human Traffiking are Gurmeet's Common Crimes

మనుషుల అక్రమ రవాణాతో పాటు అవయవాల వ్యాపారం కూడా జరిగినట్టు ఇటీవల వెల్లడించిన పోలీసులు, మరిన్ని రోజుల పాటు డేరాలో సోదాలు నిర్వహిస్తామని చెబుతున్నారు.

కనీస సురక్షతలను కూడా పాటించకుండా ఇక్కడ వ్యభిచారం జరిగిందని, ఎంతో మందికి గర్భస్రావాలు జరిగాయని, బాధితులు ఒక్కొక్కరుగా తామనుభవించిన బాధలపై ఫిర్యాదులు చేస్తున్నారని సిట్ అధికారి ఒకరు తెలిపారు.

పానిపట్ కు చెందిన లలిత అనే భక్తురాలు.. తాను పన్నెండేళ్ల క్రితం 2 నెలల వయసున్న తన చిన్నారిని డేరా సచ్ఛా సౌదాలో బాబా సేవకోసం విరాళమిచ్చినట్లు ఫిర్యాదు చేయడం, ఇప్పుడు తన కుమార్తె ఎక్కడుందో, ఎలా ఉందో తెలుపాలంటూ ఆమె కన్నీళ్లతో కోరడం అధికారులను విస్మయానికి గురిచేసింది.

ఈ ఫిర్యాదులన్నింటిపైనా దర్యాఫ్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. తనకు సహకరించే రాజకీయ నాయకులు, ప్రముఖుల కోసం గుర్మీత్ అమ్మాయిలను ఎంచుకుని మరీ పంపించేవాడని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+