ప్రభావం చూపని ‘వ్యాపమ్’: ఎన్నికల్లో బిజెపి స్వీప్
భోపాల్: మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన మొత్తం పది స్థానిక సంస్థల్లో ఎనిమిదింటిని కైవసం చేసుకోని 'వ్యాపం' కుంభకోణం ఆరోపణలు బిజెపి ప్రతిష్ఠను ఏమాత్రం దిగజార్చలేకపోయాయని స్పష్టం చేసింది.
భారీ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ కృతజ్ఞతలు తెలిపారు. 'మధ్యప్రదేశ్ స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు సంతోషం కలిగించాయి. బిజెపిపై నమ్మకాన్ని కొనసాగించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. పార్టీ కార్యకర్తల, నాయకుల కృషికి నా సెల్యూట్' అని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
MP civic poll results are gladdening. I thank people of MP for reposing their trust in BJP. I salute efforts of Karyakartas & party leaders.
— Narendra Modi (@narendramodi) August 16, 2015 కాగా, 'మీ నమ్మకాన్ని, మద్దతును కొనసాగించినందుకు కృతజ్ఞతలు, మీ క్రియాశీల నాయకత్వంలో మధ్యప్రదేశ్ అభివృద్ధిని కొనసాగిస్తుంది' అని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మిగతా రెండు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ గెలుచుకోగా, మరోచోట స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు.
Thank you very much for your continued support and faith. MP will continue to work under your dynamic leadership. https://t.co/iJykX6GRRf
— ShivrajSingh Chouhan (@ChouhanShivraj) August 16, 2015 'బిజెపి విజయం అభివృద్ధి రాజకీయాలకు సంకేతం. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరింత ఆచరణాత్మకంగా ఉండాలని చెప్పదల్చుకున్నాం. ఈ ఫలితాలపై వారు ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది' అని బిజెపి అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది అన్నారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications