Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ లకు పెరుగుతున్న క్రేజ్‌ తో కేంద్రం కొత్త ఆలోచన

ఒకప్పుడు పెళ్లంటే.. మేళతాళాలు.. వేదమంత్రాలు.. బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా ఇళ్ల దగ్గర లేదా కళ్యాణ మండపాలలో ఘనంగా జరిగేవి. కానీ ఇప్పుడు పెళ్లిళ్ల ట్రెండ్ మారిపోయింది. వివాహం చేసుకోవాలనుకున్న జంటలు సినిమాటిక్ గా పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. పెళ్లి ఒక మరపురాని ఘట్టంలా మలచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ షూట్ లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్ లతో పెళ్లి అంటేనే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతున్న భారతీయ జంటలు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇప్పుడు కొత్త కొత్త ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. ఒకప్పుడు తాము నివసించే ప్రాంతంలోనే, తమ ఊర్లోనే, తమ ఇంటి వద్దనే పెళ్లి చేసుకోవాలని భావిస్తే.. ఇప్పుడు అలాకాదు.. అందమైన లొకేషన్లలో, ప్రశాంతమైన వాతావరణంలో, ఊరికి దూరంగా ఎక్కడో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.

destination wedding craze in India

ఇక పెళ్లికి బంధుగణంతో పాటు, స్నేహితులు, తెలిసినవారు ఇలా చాలా మందిని పిలిచి అట్టహాసంగా పెళ్లిళ్లు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో చాలా లిమిటెడ్ గా వివాహానికి ముఖ్యమైన వారిని మాత్రమే ఆహ్వానిస్తూ పెళ్లిళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ప్రాధాన్యత చాలా పెరిగిపోయింది. సగటున 15 లక్షల నుంచి 4 కోట్ల వరకు ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఖర్చవుతుంది.

అయినప్పటికీ చాలా వరకు భారతీయ జంటలు ఇదే తరహాలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ ల కోసం ఉన్నత వర్గాల్లోని వారు ఒక్కొక్క అతిథికి 60 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో కేంద్రం సైతం దేశంలో 50కి పైగా డెస్టినేషన్ వెడ్డింగ్ ల కోసం మంచి స్థలాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది.

బాగా ఎక్కువ బడ్జెట్ కాకుండా డెస్టినేషన్ వెడ్డింగ్ ఎలా చేసుకోవాలి అని ప్లాన్ చేసే వారు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా మంచి పర్యాటక ప్రాంతాలలో డెస్టినేషన్ వెడ్డింగ్ లను నిర్వహించే ఈవెంట్ ఆర్గనైజర్స్ పెరిగిపోయారు. ఈ క్రమంలో కేంద్రం కొత్త ఆలోచన చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+