బిజెపి ధ్వజం: ఆదర్శ్ స్కామ్‌లో దేవయాని పాత్ర?
ముంబై: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ తుది నివేదికను రాష్ట్ర మంత్రివర్గం తిరస్కరించడంపై బిజెపి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై విరుచుకుపడుతోంది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై విచారణ జరిపిన కమిషన్ తుది నివేదికను ప్రభుత్వం అంతకు ముందు శాసనసభ ముందు ఉంచింది. ఆ నివేదికలో రాజకీయ నాయకుల పేర్లు, అధికారుల పేర్లు చోటు చేసుకున్నాయి.
అర్హత లేకపోయినప్పటికీ ఫ్లాట్స్ పొందినవారిలో అమెరికాలోని భారత దౌత్యవేత్త దేవయాని పేరు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బంధువుల పేర్లు ఉన్నాయని పిటిఐ వార్తా సంస్థ ఓ వార్తాకథనంలో తెలిపింది. నివేదికను తిరస్కరించడం ద్వారా కాంగ్రెసు, ఎన్సీపి సంయుక్త ప్రభుత్వం అవినీతి ముఖం బయటపడిందని బిజెపి అధ్యక్షుడు దేవేంద్ర ఫద్నావిస్ మీడియా ప్రతినిధులతో అన్నారు.

నివేదికను తిరస్కరించడం ద్వారా అశోక్ చవాన్ కూడా అవినీతిలో పాలు పంచుకున్నానని రుజువు చేసుకున్నారని ఫద్నవీస్ వ్యాఖ్యానించారు. ఆదర్శ్ కుంభకోణంపై న్యాయ పోరాటం చేయడానికి గల అవకాశాలపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాము కోర్టుకు వెళ్తామని చెప్పారు.
కాంగ్రెసు, ఎన్సీపి ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడుతామని అన్నారు. దోషులకు శిక్ష పడేవరకు తాము న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టుకూ సుప్రీంకోర్టుకూ వెళ్తామని ఆయన చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications