బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిగ్గీ రాజ‘దిగ్విజయ్ సింగ్’అల్లుడి చీటింగ్ కేసు: రూ.1.15 కోట్ల చెక్ లు బౌన్స్, చంద్రబాబు కేసు !

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ అల్లుడి మీద బెంగళూరు నగరంలో కేసు నమోదు అయ్యింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ అల్లుడి మీద బెంగళూరు నగరంలో కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ కాంట్రాక్టు ఇప్పిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అల్లుడు భవానీ సింగ్ మోసం చేశారని కేసు నమోదు అయ్యింది.

కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా దిగ్విజయ్ సింగ్ గతంలో పని చేశారు. ఆ సందర్బంలో బెంగళూరుకు చెందిన బాలాజీ ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని చంద్రబాబుతో దిగ్విజయ్ సింగ్ అల్లుడు భవానీ సింగ్ భేటీ అయ్యారని సమాచారం.

Digvijay Singhs son inlaw Bhawani Singh booked for cheating case

ఆ సందర్బంలో కర్ణాటక ప్రభుత్వంలో మీకు కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మించిన భవానీ సింగ్ తన దగ్గర రూ. 1.15 కోట్లు తీసుకున్నారని బాలాజీ ఎలక్ట్రికల్స్ యజమాని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ తరువాత కర్ణాటక శాఖ బాధ్యతల నుంచి తప్పుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు.

తాను ఇచ్చిన నగదు తిరిగి చెల్లించాలని దిగ్విజయ్ సింగ్ అల్లుడు భవానీ సింగ్ కు మనవి చేశానని, ఆయన రూ. 25, రూ. 35, రూ. 55 లక్షలకు చెక్ లు ఇచ్చారని, మూడు చెక్ లు బౌన్స్ అయ్యాయని చంద్రబాబు బెంగళూరులోని 22వ ఏసీఎంఎం న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు.

English summary
Congress party leader Digvijay Singhs son inlaw Bhawani Singh booked for cheating case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X