షాకింగ్: ప్రత్యూష మృతితో ఆప్‌సెట్, అభిమాని ఆత్మహత్య

ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య అంశంలో షాకింగ్! ప్రత్యూష ఆత్మహత్యను తట్టుకోలేక ఓ అభిమాని తన రెండున్నరేళ్ల తనయుడి ముందే ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగు చూసింది.

మృతురాలి పేరు మధు మహానంద్. ఆమె భర్త లోకేషథ్. మధు మహానాంద్ నిత్యం బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌ను చూస్తుంటుంది. ప్రతి రోజు ఆ సీరియల్ చూస్తుంది. దీంతో ఆమె ప్రత్యూషకు అభిమానిగా మారింది.

Distressed by Pratyusha Banerjee suicide, fan ends life

ఆ తర్వాత.. ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఆమె విన్నది. దీంతో బాగా అప్ సెట్ అయింది. ప్రత్యూష ఆత్మహత్యను ఆమె తన భర్తతో కూడా చర్చించేది. ప్రత్యూష ఆత్మహత్య విషయమై పదేపదే వార్తలు చూసి ఆమె బాగా అప్ సెట్ అయింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో తన రెండున్నరేళ్ల కొడుకు ముందు ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో భర్త కార్యాలయానికి వెళ్లాడు.

రాయపూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సిగ్ మాట్లాడుతూ... ప్రాథమిక సమాచారం మేరకు బాధితురాలు నిత్యం సీరియల్ చూసేదని, ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యతో బాగా అప్ సెట్ అయిందని, ప్రత్యూష ఆత్మహత్య కారణంగా డిప్రెషన్‌కు గురైన ఆమె తన జీవితాన్ని ముగించినట్లుగా తెలుస్తోందని చెప్పారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+