Wife: నన్నే పుట్టింటికి పంపించవా ?, నీ ఇంట్లోనే కాదు నీ జీవితంలో కూడా ఉండను, నువ్వు పండగ చేసుకో !
చెన్నై: సమీప బందువులు అయిన యువతి, యువకుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా ఉంటున్నారు. దీపావళి పండుగకు మా పుట్టింటికి వెలుతానని భార్య ఆమె భర్తకు చెప్పింది. దీపావళి పండుగ ఎక్కడైనా చేసుకోవచ్చు, మీ పుట్టింటికి వెళ్లి పండుగ ఎందుకు చేసుకోవాలి అని రూల్ ఏమైనా ఉందా అంటూ భర్త అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవ జరిగింది. భార్యను పుట్టింటికి పంపించడానికి భర్త అంగీకరించలేదు. నన్ను పుట్టింటికి పంపిచకుండా చేస్తావా ?, నీ ఇంట్లోనే కాదు, నీ జీవితంలో కూడా నేను ఉండను, నువ్వు పండగ ఎలా చేసుకుంటావో నేను చూస్తా అంటూ భార్య ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు.

లవ్ మ్యారేజ్
చెన్నై సిటీలోని వడపళని సమీపంలోని అళగర్ పెరుమాల్ కోయిల్ స్ట్రీట్ లో వివేక్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వివేక్ కు సమీప బంధువు అయిన రవళి (27) అనే యువతి చెన్నైలోనే నివాసం ఉంటున్నది. సమీప బందువులు అయిన వివేక్, రవళి ప్రేమించుకుని గత ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

పండుగ కోసం గొడవలు
వివాహం చేసుకున్న రవళి, వివేక్ దంపతులు ఇంతకాలం చాలా సంతోషంగా జీవించారు. దీపావళి పండుగకు మా పుట్టింటికి వెలుతానని రవళి ఆమె భర్త వివేక్ కు చెప్పింది. దీపావళి పండుగ ఎక్కడైనా చేసుకోవచ్చు, మీ పుట్టింటికి వెళ్లి పండుగ ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ ఎవరు పండుగ చేస్తారు అంటూ వివేక్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

నీ జీవితంలో ఉండను అని డిసైడ్ అయిన భార్య
ఇదే విషయంలో రవళి, వివేక్ దంపతుల మద్య గొడవ జరిగింది. రవళిని పుట్టింటికి పంపించడానికి ఆమె భర్త వివేక్ అంగీకరించలేదు. నన్ను పుట్టింటికి పంపిచకుండా చేస్తావా ?, నీ ఇంట్లోనే కాదు, నీ జీవితంలో కూడా నేను ఉండను, నువ్వు పండగ ఎలా చేసుకుంటావో నేను చూస్తా అంటూ రవళి ఆవేశంతో వెళ్లి ఉరి వేసుకుంది.

ఆవేశంలో ప్రాణం తీసుకుంది
భార్య రవళి ఆవేశంతో వెళ్లి ఉరి వేసుకోవడంతో హడలిపోయిన వివేక్ స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి భార్యను కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రవళి మరుసటి రోజు చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications