బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: ముంబైలో ఎమ్మెల్యేలు, బీజేపీ లీడర్స్ ఆపరేషన్ కమల, కర్ణాటక ప్రభుత్వం, డీకే శివకుమార్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ ఆపరేషన్ కమల మొదలు పెట్టిందని ఆ రాష్ట్ర మంత్రి డీకే. శివకుమార్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలకు బీజేపీ వల వేస్తోందని డీకే. శివకుమార్ అన్నారు.

కొంత మంది ఎమ్మెల్యేలను ముంబైలో కాపాడుతున్న బీజేపీ నాయకులు అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారని డీకే. శివకుమార్ బెంగళూరులో మీడియాకు చెప్పారు. బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని డీకే. శివకుమార్ జోస్యం చెప్పారు.

ముంబైలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు తనకు తెలుసని, వారి పేర్లు బయటకు చెబితే మీడియాలో ప్రసారం అవుతాయని, తరువాత వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని డీకే. శివకుమార్ అన్నారు. ముంబైలో ఎవరితో భేటీ కావడానికి ఎమ్మెల్యేలు వెళ్లారు అనే విషయం తనకు తెలీదని డీకే. శివకుమార్ చెప్పారు.

 DK Shivakumar said BJPs Operation Lotus to topple the States coalition government

ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ పేరు తనకు తెలుసని డీకే. శివకుమార్ అన్నారు. బీజేపీ నాయకుల ఆపరేషన్ కమలను తాము తిప్పికొడతామని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని మంత్రి డీకే. శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీసీ, పాటిల్ ఆయన కుమార్తె వివాహం విషయంపై ఇతర ప్రాంతాలకు తిరుగుతున్నారని, త్వరలో ఆయనకు మంచి పదవి వచ్చే అవకాశం ఉందని మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని డీకే. శివకుమార్ అన్నారు.

సంక్రాంతి పండుగ తరువాత కర్ణాటకలో క్రాంతి వస్తుందని, త్వరలో మనకు మంచి రోజులు వస్తాయని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని డీకే. శివకుమార్ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోని అవినీతిపరులను తాము జైలుకు పంపిస్తామని బీజేపీ నాయకులు కోతలుకోస్తున్నారని డీకే. శివకుమార్ విమర్శించారు.

English summary
Karnataka water resource minister DK Shivakumar said BJP's Operation Lotus to topple the State's coalition government was for real alleging that three Congress MLAs were camping in a hotel in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X