సుప్రీం కోర్టు ఆదేశాలతో ఊపిరి పీల్చుకున్న డీకే శివకుమార్, సీబీఐ కేసులో రిలాక్స్ !
న్యూఢిల్లీ/బెంగళూరు: సీఎం సీటు కోసం సిద్దరామయ్యతో పోటీ పడుతూ ఫుల్ టెన్షన్ లో ఉన్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కు సుప్రీం కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. డీకే. శివకుమార్ మీద సీబీఐ అధికారులు పెట్టిన కేసు విచారణలో టెన్షన్ పడుతున్న ట్రబుల్ షూటర్ సుప్రీం కోర్టు ఆదేశాలతో ఊపిరి పీల్చుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం ప్రకటించినా ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేకపోయింది. సీఎం సీటు నీకా ?, నాకా అంటూ మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శికుమార్ పోట్లాడుకుంటున్న సమయంలో సీఎం పేరు ప్రకటించడంలో ఆలస్యం అవుతోంది.

సీఎం సీటు తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న డీకే శివకుమార్ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు మకాం వేశారు. ఢిల్లీలో ఉన్న డీకే శివకుమార్ ఇప్పుడు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ప్రకటించి నాలుగు రోజులు అయినా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం కర్ణాటకలో కొత్త సీఎం పేరు ప్రకటించలేక నానాతంటాలు పడుతోంది.
డీకే శివకుమార్ మీద ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయని, ఆయన్ను సీఎం చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని కొందరు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చెప్పారు. రెండు రోజుల నుంచి సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య ఢిల్లీలో రాజీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నది.

తనకు సీఎం పదవి ఇవ్వకుంటే తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని డీకే శికుమార్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో డీకే శివకుమార్ కు సుప్రీం కోర్టు నుంచి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. డీకే శివకుమార్ మీద నమోదు అయిన కేసుల విచారణకు ఇచ్చిన స్టేని ఎత్తివేయాలని ఇప్పటికే సీబీఐ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీం కోర్టులో సీబీఐ వేసిన పిటిషన్ బుధవారం విచారణ జరిగింది. సుప్రీం కోర్టు నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేసి మీరు కర్ణాటక హైకోర్టులో స్టే ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చెయ్యాలని సీబీఐకి సూచించింది. డీకే శివకుమార్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.
డీకే శివకుమార్ మీద నమోదు అయిన సీబీఐ కేసు విచారణ జులై నెలకు వాయిదా వేసిన సుప్రీం కోర్టు కేసు విచారణకు ఇచ్చి స్టే ఎత్తివేయాలని మీరు హైకోర్టులో లో అప్పిలు చేసుకోవచ్చిన సీబీఐ అధికారులకు సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో డీకే శివకుమార్ తాత్కాలికగంగా ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications