తమిళ హీరో,డీఎండీకే అధినేత విజయకాంత్ ఇక లేరు!!
తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గతంలో కూడా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం మళ్లీ ఆయన కరోనా సోకడంతో ఇబ్బంది పడుతున్న క్రమంలో మళ్లీ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
Recommended Video

కరోనా మహమ్మారి కారణంగా ఆయన పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు.గతంలో కూడా విజయకాంత్ కరోనా బారిన పడ్డారు. 2020 సెప్టెంబర్ లో విజయ్ కాంత్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్ఐఓటి ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇక తర్వాత 2018వ తేదీన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అదే ఆసుపత్రిలో చేరిన ఆయన అనంతరం ఆరోగ్యం మెరుగు పడడంతో 11వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు.

డిస్చార్జ్ అయిన తర్వాత డిఎండికె వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాలలో కూడా విజయకాంత్ పాల్గొన్నారు. అయితే మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితిపై డీఎండీకే ప్రధాన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆయనకు కరోనా సోకిందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి క్షీణించింది అని వెల్లడించింది.
అయితే శ్వాస సమస్యలతో ఆయన పరిస్థితి విషమంగా మారడంతో వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. తమిళ నటుడు, డిఎండికె వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ కాంత్ తన సినీ, రాజకీయ అభిమానులను శోక సంద్రంలో ముంచి కానరాని లోకాలకు చేరిపోయారు. ప్రస్తుతం ఆయన వయస్సు 71 సంవత్సరాలు.
తమిళ నటుడు విజయ్ కాంత్ పోలీస్ అధికారిగా 20కి పైగా సినిమాలలో కనిపించారు. విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం 'విరుధగిరి'. అందులో ఆయనే హీరో. ఇక 1984లో విజయకాంత్ నటించిన 18 సినిమాలు విడుదల కావడం విశేషంగా చెబుతారు.
ఆయన నటించిన ఆఖరి సినిమా 'సగప్తం' . 2015 సంవత్సరంలో ఈ సినిమాను తీశారు. 'మనకనక్కు'లో కోలీవుడ్ నటుడు కమల్‌హాసన్‌తో, 'వీరపాండియన్'లో తమిళ నటుడు శివాజీ గణేశన్‌తో కలిసి విజయ్ కాంత్ నటించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications