ఎమ్మెల్యేకు కారు ప్రమాదం : తీవ్ర గాయాలతో ఆసుపత్రికి
చెన్నై : డీఎంకే ఎమ్మెల్యే రఘుపతి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి పుదుకోట సమీపంలో ఈ ప్రమాదం చోట చేసుకుంది. పుదుపట్టిలో పార్టీ నిర్వాహకుడి కర్మ క్రియల్లో పాల్గొని వెనుతిరిగారు ఎమ్మెల్యే. ఈ క్రమంలో ఒత్తపులికుడియిరుప్పు సమీపంలోకి రాగానే రోడ్డుగా అడ్డంగా ఓ బైకు రావడం గమనించిన డ్రైవర్.. సడెన్ బ్రేక్ వేశాడు.

దీంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎమ్మెల్యే రఘుపతి తీవ్రంగా గాయపడడంతో.. చికిత్స నిమిత్తం ఆయన్ను పుదుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, తమిళనాడులోని తిరుమయం నియోజకవర్గం నుంచి డీఎంకే తరుపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రఘుపతి.












Click it and Unblock the Notifications