ఎంఏల్ఏలు చెన్నైకు రాకూడదు, స్టాలిన్ వ్యూహమిలా...
అన్నాడిఎంకెలో నెలకొన్న సంక్షోభాన్ని డిఎంకె నిశితంగా పరిశీలిస్తోంది. అన్నాడిఎంకెలో చొటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో డిఎంకె ఎంఏల్ఏల సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ .
చెన్నై:అన్నాడిఎంకెలో నెలకొన్న సంక్షోభాన్ని డిఎంకె నిశితంగా పరిశీలిస్తోంది. అన్నాడిఎంకెలో చొటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో డిఎంకె ఎంఏల్ఏల సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ .
అన్నాడిఎంకెలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో డిఎంకె వ్యూహత్మంగా అడుగులు వేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు తీసుకోవాల్సిన వ్యూహలపై చర్చించేందుకుగాను డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఎంఏల్ఏల సమావేశాన్ని నిర్వహించాలని భావించాడు.
అయితే అన్నాడిఎంకెలో చోటుచేసుకొన్న సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ఈ తరుణంలో సమావేశం నిర్వహించకూడదని స్టాలిన్ బావించాడు.

అన్నాడిఎంకెలో పరిస్థితులు సద్దుమణిగి అసెంబ్లీలో బలనిరూపణకు ముహుర్తం ఖరారైన తర్వాత ఎంఏల్ ఏలతో సమావేశాన్ని నిర్వహించాలని స్టాలిన్ భావిస్తున్నారు.
ఈ మేరకు ఎంఏల్ఏలతో జరుపతలపెట్టిన సమావేశాన్ని స్టాలిన్ వాయిదావేశారు. పార్టీ ఎంఏల్ఏలు ఎవరూ కూడ చెన్నైకు రాకూడదని స్టాలిన్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications