Coronavirus: కరోనా కాటుకు మరో టాప్ లీడర్ బలి, ఎమ్మెల్యేకి పాజిటివ్, ఫ్యామిలీ మొత్తం, ప్రజాసేవలో !
చెన్నై/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో రికార్డు బ్రేక్ చేస్తూ తమిళ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు తమిళనాడులో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు మరణిస్తున్నారు. ఇప్పటికే డీఎంకే పార్టీ సీనిమర్ ఎమ్మెల్యే కరోనా వైరస్ కాటుకు మరణించాడు. ఇప్పుడు అదే డీఎంకే పార్టీకి చెందిన మరో టాప్ లీడర్ మరణించారు. డీఎంకే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీని క్వారంటైన్ కు తరలించారు. ఈ దెబ్బతో డీఎంకే పార్టీ నేతలతో పాటు సామన్య ప్రజలు హడలిపోతున్నారు. ఆదివారం వరకు తమిళనాడులో 59, 337 కరోనా కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెప్పారు.

తమిళనాడు పేరు వింటే దడదడ
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువగా నమోదు అయ్యింది మహారాష్ట్రలోనే అనే విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలో కరోనా వైరస్ తాండవం చేస్తున్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి వరుసలో ఉంది. తమిళనాడులో ఆదివారం రాత్రి వరకు 59, 337 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఒక్క ఆదివారం (జూన్ 21) మాత్రమే తమిళనాడులో 2, 582 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.
తమిళనాడులో కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు ఇప్పటి వరకు 757 మంది మరణించారు.

చెన్నై కోయంబేడు దెబ్బ
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో కరోనా వైరస్ దెబ్బకు మళ్లీ అక్కడ సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేశారు. జూన్ 21వ తేదీ ఆదివారం చెన్నై సిటీలో జనతా కర్ఫూ విధించారు. అయినా ఒక్క చెన్నై సిటీలో ఆదివారం ఏకంగా 1, 493 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నైలో ఇప్పటి వరకు మొత్తం 41, 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నైలో కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై ఇప్పటి వరకు 53 మంది మరణించారు.

చెన్నై టాప్ లీడర్ కరోనాకు బలి
ఉత్తర చెన్నై జిల్లా డీఎంకే పార్టీ కార్యదర్శిగా గత 25 ఏళ్లుగా పని చేస్తున్న ఆ పార్టీ టాప్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధికి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన బలరామన్ (77) కు కరోనా వైరస్ వ్యాధి సోకింది. కరోనా వైరస్ వ్యాధితో చికిత్స పొందుతున్న బలరామన్ చికిత్స విఫలమై మరణించడంతో డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే. స్టాలిన్ తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు షాక్ కు గురైనారు.

ఒకే సారి కరోనా, టైఫాయిడ్ జ్వరం
ఐదు రోజుల క్రితం చెన్నై అన్నానగర్ లోని శాంతి కాలనీలో నివాసం ఉంటున్న బలరామన్ ను ఆసుపత్రికి తరలించడం, కారోనా వైరస్ సోకిందని వెలుగు చూడటం, అదే సమయంలో ఆయనకు టైఫాయిడ్ జ్వరం రావడంతో చికిత్స విఫలమై మరణించారని వైద్యులు చెప్పారు. డీఎంకే పార్టీ తనిఖి విభాగం సీనియర్ నాయకుడు అయిన బలరామన్ మరణించడం పార్టీకి తీరనిలోటు అని ఆ పార్టీ చీఫ్ ఎంకే. స్టాలిన్ అన్నారు. బలరామన్ కుటుంబ సభ్యులకు ఎంకే. స్టాలిన్ సానుభూతి తెలిపారు. డీఎంకే పార్టీ సీనియర్ నేత బలరామన్ కు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
తమిళనాడులో కరోనా వైరస్, లాక్ డౌన్ సేవల్లో పాల్గోనాలని డీఎంకే పార్టీ నేత ఎంకే. స్టాలిన్ ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజా సేవలో ఉన్న నాయకులు ఇప్పుడు కరోనా వైరస్ బారినపడటంతో ఆ పార్టీ నేతలు హడలిపోతున్నారు. ఇప్పటికే డీఎంకే పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అన్భళగన్ కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు. ఇప్పుడు తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలోని రిశివంధియమ్ నియోజక వర్గం డీఎంకే పార్టీ ఎమ్మెల్యే వసంతమ్ కార్తికేయన్ తో పాటు ఆయన తల్లికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

క్వారంటైన్ లో ఎమ్మెల్యే ఫ్యామిలీ
కళ్లకురిచ్చి జిల్లా రిశివంధియమ్ నియోజక వర్గం డీఎంకే పార్టీ ఎమ్మెల్యే వసంతమ్ కార్తికేయన్, ఆయన తల్లికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయన కుటుంబ సభ్యులు అందరికీ వైద్య పరీక్షలు చేశారు. డీఎంకే పార్టీ ఎమ్మెల్యే వసంతమ్ కార్తికేయన్ భార్య, వారి పిల్లలకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు వారిని క్వారంటైన్ కు తరలించారు. ప్రజా సేవలో ఉంటున్న ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు కరోనా పాజిటివ్ వస్తోందని వెలుగు చూసిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయ నాయకులు హడలిపోతున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications