ఇరుముడిలో ఈ వస్తువులను తీసుకురావొద్దు: భక్తులకు శబరిమల ఆలయ బోర్డు

Sabarimala: శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డ్ కీలక సూచనలు చేసింది.
ఈ మేరకు సర్కూలర్ జార చేయనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్యమ్ బోర్డ్ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఇక, కొచ్చి, మలబార్ దేవస్యమ్ బోర్డు సహా కేరళలోని ఇతర ఆలయ పాలక మండళ్లకు, ఇతర రాష్ట్రాల గురుస్వాములకు లేఖ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో దేవస్యమ్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్పూరం, అగరబత్తీలు, పూజా సామాగ్రి అయినప్పటికీ.. వీటి కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ట్రావెన్ కోర్ దేవస్యమ్ బోర్డ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సన్నిధానంలో అగరబత్తీలు, కర్పూరం కాల్చడానికి అనుమతి లేదు. దీంతో ఇరుముడికట్టులో భక్తులు తీసుకొచ్చే సరుకుల్లో ఎక్కువ భాగం వృథాగా ఉండిపోతున్నాయి.

Do not bring these items in Irumudi Devotees Sabarimala Temple Board

వీటన్నంటినీ దహనశాలకు తీసుకెళ్లి కాల్చుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు దేవస్యమ్ బోర్డు భక్తులకు ఈ మేరకు సూచనలు చేసింది. కాగా, ఆలయ ప్రధాన పాలకుడు(తంత్రి) రాజీవరు ఇరుముడికట్టులో అగరబత్తీలు, కర్పూరం వంటి వస్తువులను తొలగించాలని దేవస్యమ్ బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఆలయ బోర్డ్ తాజా నిర్ణయం తీసుకుంది.

పూర్వం భక్తులు కాలినడకన వచ్చినప్పుడు అన్నం, కొబ్బరికాయలను వారి వెంట తెచ్చుకునేవారు. ఇప్పుడు అన్ని చోట్లా ఆహారం దొరుకుతోంది. కాబట్టి ఇరుముడికట్టుతో వచ్చేవారు కొంచెం బియ్యం తెచ్చుకోండి.. వాటిని శబరిమలలో సమర్పించవచ్చు అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేవస్యమ్ బోర్డు సూచించిన విధంగా అయ్యప్ప స్వాములు ఆ వస్తువులను తీసుకెళ్లకుంటే మంచిది.

మరోవైపు, మండల పూజల సమయంలో శబరిమల దర్శనానికి వచ్చే భక్తులకు స్పాట్ బుకింగ్ పైనా దేవస్యమ్ బోర్డు మరోసారి స్పష్టతనిచ్చింది. వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా వచ్చే భక్తులకు మూడు చోట్ల స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని బోర్డ్ నిర్ణయించింది. స్పాట్ బుకింగ్ కోసం భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. దీని కోసం భక్తులు ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలి. పంబా, ఎరుమేలి, సత్రంలో స్పాట్ బుకింగ్ కౌంటర్లు తెరవనున్నారు. స్పాట్ బుకింగ్ ద్వారా 10 వేల మంది దర్శనం చేసుకోవచ్చు. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా 70 వేల మంది దర్శనం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+