Water: 750 మిల్లిలీటర్ నీటికి రూ.45 లక్షలు.. ఎక్కడంటే.. !
మనం ఎవరింటికీ వెళ్లినా మొదటగా నీళ్లు ఇస్తారు. మనం రోడ్డు పై వెళ్తున్నప్పుడు దాహమైన ఎవరినైనా అడిగితే నీరు ఇస్తారు. కానీ ఈ నీరు ఇప్పుడు కస్ట్లిగా మారుతుంది. నీళ్లు బాటిల్ ధర షాంపైన్‌లు, వైన్ కన్నా ఎక్కువగా ఉంది. ఇంతకీ ఆ వాటర్ బాటిల్ ధర ఎంతంటే.. అక్షరాల రూ.45 లక్షలు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఈ నీటికి ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబుటో ఎ మోడిగ్లియాని అని పిలుస్తారు. ఒక 750 మి.లీ వాటర్ బాటిల్ ధర వచ్చేసి నమ్మలేని విధంగా రూ. 45 లక్షలు (60,000 డాలర్లు)గా ఉంది.
అయితే ఇంత విలువైన నీటిని ఎవరైనా తాగుతారా అంటే తాగుతారు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా ఖరిదైన నీటిని తాగుతారు. వీటి లీటర్ రూ.4000 గా ఉంది. విరాట్ కోహ్లి నీటికి ఏడాదికి రూ.4-5 లక్షలు నీటికే ఖర్చు చేస్తాడటని తెలిసింది. విరాట్ కోహ్లి ఎవియన్ నేచురల్ స్ప్రింగ్ బ్రాండ్ నీళ్లను తాగుతాడని తెలుస్తోంది. ఈ నీటిని ఫ్రాన్స్ నుంచి చెప్పించుకుంటున్నాడు. మార్చి 4, 2010న యూఎస్ లో ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఇ మొడిగ్లియాని వాటర్ బాటిల్ కోసం జరిగిన వేలంలో 60,000 డాలర్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించారు. అంటే ఇది రూపాయిలలో చెప్పాలంటే దాదాపు రూ.49 లక్షలు. ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఇ మోడిగ్లియాని బ్రాండ్ వాటర్ ను ఈ భూమిపై మూడు ప్రదేశాల నుంచి సేకరిస్తారు. అవి ఫిజీ, ఫ్రాన్స్, ఐస్‌లాండ్‌లోని హిమానీనదాలు.

ఇవి ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం కావడంతోఈ నీరు ఎంతో స్వచ్ఛమైనదగా భావిస్తుంటారు. ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఇ మొడిగ్లియాని తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన వాటర్ బ్రాండ్ జపాన్ నీరు. దీన్ని సముద్ర మట్టానికి వేల అడుగుల లోతు నుండి సేకరిస్తారు. కొన్ని ప్రత్యేకమైన మినరల్స్ ఈ నీటిలో ఉంటాయి. ఈ నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారట.లీటరు నీటి ధర దాదాపు రూ.44,000గా ఉంది. మన దేశంలో కూడా ఈ విధమైన నీళ్ల బాటిల్లను రూ. 50 నుంచి 150 వరకు అమ్ముతున్నారు.
అయినప్పటికీ ఈ వాటర్ బాటిల్ ఎందుకంత ధర పలుకుతుంది? ఇదేనా మీ అనుమానం.. అనేకానేక కారణాల్లో ఈ వాటర్ బాటిల్ డిజైన్ కూడా ఒక కారణమే. ఎందుకంటే. ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఇ మొడిగ్లియా బాటిల్ ఆకారాన్ని ప్రపంచంలోనే ప్రసిద్ధ బాటిల్ డిజైనర్ అయిన ఫెర్నాండో అల్టామిరానో డిజైన్ చేశాడు. ప్రపంచంలోనే అతి ఖరీదైన హెన్రీ 4 హెరిటేజ్ డ్యుడోగ్నన్ కోగ్‌న్యాక్ అనే వైన్ బాటిల్ కూడా ఇతనే డిజైన్ చేశాడు.












Click it and Unblock the Notifications