వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయనకు కోపం వచ్చింది, మీరు అక్కడ ఎందుకున్నారో తెలుసా ?

పార్లమెంట్ సమావేశాల్లో సభ సమయం వృధా కావడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ కార్యక్రమాలు సజావుగా సాగకపోవడం సరైంది కాదన్నారు. పార్లమెంట్ కార్యకలాప

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పార్లమెంట్ లో ప్రతిష్టంభన కొనసాగుతుండడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల సమయాన్ని వృధా చేయడం సరైంది కాదన్నారు.పార్లమెంట్ కార్యకలాపాలను కొనసాగించాలని ఆయన ఇరుపక్షాలను కోరారు.

సమయం వృధా పై సీనియర్ల ఆగ్రహం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఒక్కరోజూ కూడ సభ కార్యకలాలపాలు సజావుగా సాగలేదు. పెద్ద నగదు నోట్ల రద్దు అంశంపై ఉభయసభలు అట్టుడికిపోతున్నాయి. ప్రతిరోజూ రెండు సభల్లో ఇదే తంతు కన్పిస్తోంది.అయితే ఈ తరహ ఘటనలు ప్రతిరోజూ పునరావృతం కావడం పట్ల సీనియర్ పార్లమెంటేరియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుదవారం నాడు లోక్ సభలో మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్ కె అద్వానీ సీరియస్ అయ్యారు. ప్రతిరోజూ సభ కార్యకలాపాలు సాగకపోవడం పట్ల ఆయన ఆవేదన చెందారు. లోక్ సభను నిరవధిక వాయిదా వేయండంటూ ఆయన సూచించారు.పార్లమెంట్ లో చోటుచేసుకొంటున్న ఘటనలపై అద్వానీ తీవ్రంగానే స్పందించారు.

pranab

ప్రణబ్ కూడ ఆగ్రహం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభ కార్యక్రమాలు జరగకుండా ప్రతిరోజూ గందరగోళం చోటుచేసుకోవడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడ అసంతృప్తిని వ్యక్తం చేశారు.పార్లమెంట్ నడిచేందుకే మీరు అక్కడ ఉన్నారు, పార్లమెంట్ కార్యకలాపాలను భంగపర్చడం అంగీకరించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజ్యసభలో కూడ ఇదే పరిస్థితి

పెద్ద నగదు నోట్ల రద్దు విషయమై రాజ్యసభలో కూడ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు పెద్ద నగదు నోట్ల రద్దు విషయమై సభ కార్యక్రమాలను అడ్డుకొంటున్నారు.విపక్షాలు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని అధికారపక్షం ప్రకటిస్తోంది. అయితే సభ కార్యక్రమాలు కొనసాగే పరిస్థితులు కన్పించడం లేదు. దరిమిలా గందరగోళ పరిస్థితుల మధ్యే సభ వాయిదా పడుతోంది.

English summary
for god's sake do your job, you are meant transact business in parliament disrupution of parliament is not acceptable at all siad president pranab mukharjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X