• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Doctor: డాక్టర్ ఢమాల్, ఆయుష్మాన్ ఆఫీసర్ కర్మకాండ, ఆసుపత్రిలో 9 మంది మహిళా ఉద్యోగులతో ?, ఫోటోలు !

|
Google Oneindia TeluguNews

మంగళూరు/ బెంగళూరు: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి పేద ప్రజలకు, రోగులకు సేవ చేస్తాడని పై అధికారులు అనుకున్నారు. ఆయుష్మాన్ జిల్లా నోడల్ అధికారిగా బాద్యతలు చేపట్టాడు. కృష్ణురోగం నివారాణ, మానసిక ఆరోగ్య విభాగం సీనియర్ అధికారిగా పని చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాటి మహిళా ఉద్యోగులతో కామాంధుడైన డాక్టర్ ఆసుపత్రిలోనే రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టాడు. నయానా భయానా 9 మంది మహిళా ఉద్యోగులను లొంగదీసుకున్న డాక్టర్ ఆసుపత్రిలోని రోగుల బెడ్ మీదే దుకాణం పెట్టేశాడు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళతో పాద పూజలు చేయించుకోవడం, అతని క్యాబిన్ లో వారితో కలిసి డ్యాన్స్ లు చేస్తూ రొమాన్స్ చేశాడు. డాక్టర్ తిక్కచేష్టలు చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు బయటకు రావడం కలకలం రేపింది. ఆయుష్మాన్ నోడల్ ఆఫీసర్ అయిన డాక్టర్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశామని స్వయంగా జిల్లా కలెక్టర్ మీడియాకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

Nurse: పూజ గదిలో ప్రభుత్వ ఆసుపత్రి నర్సు దారుణ హత్య, భర్తతో విడిపోయి ఒంటరిగా ?, ఏం జరిగిందంటే !Nurse: పూజ గదిలో ప్రభుత్వ ఆసుపత్రి నర్సు దారుణ హత్య, భర్తతో విడిపోయి ఒంటరిగా ?, ఏం జరిగిందంటే !

 ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, ఆయుష్మాన్ నోడల్ ఆఫీసర్

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, ఆయుష్మాన్ నోడల్ ఆఫీసర్

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు సిటీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రత్నాకర్ వైద్యుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ రత్నాకర్ పేద ప్రజలకు, రోగులకు సేవ చేస్తాడని ఆరోగ్య శాఖ అధికారులు అనుకున్నారు. డాక్టర్ రత్నాకర్ ఆయుష్మాన్ జిల్లా నోడల్ అధికారిగా బాద్యతలు చేపట్టాడు.

 రెచ్చిపోయిన డాక్టర్

రెచ్చిపోయిన డాక్టర్

కృష్ణురోగం నివారాణ, మానసిక ఆరోగ్య విభాగం సీనియర్ అధికారిగా పని చేస్తున్న డాక్టర్ రత్నాకర్ తనకు తిరుగులేదని గాల్లో తేలిపోయాడు. మంగళూరు సిటీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పెత్తనం చెలాయిస్తున్న డాక్టర్ రత్నాకర్ ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. రోగుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించాడని గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి.

 9 మంది మహిళా ఉద్యోగులను లైన్ లో పెట్టాడు

9 మంది మహిళా ఉద్యోగులను లైన్ లో పెట్టాడు


డాక్టర్ రత్నాకర్ ఉద్యోగం చేస్తున్న మంగళూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 12 మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. 12 మంది మహిళల మీద కామాంధుడైన డాక్టర్ రత్నాకర్ కన్ను వేశాడు. 12 మందిలో 9 మంది మహిళలను లొంగదీసుకున్న డాక్టర్ రత్నాకర్ సాటి ఉద్యోగులు అని కూడా చూడకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

మహిళా ఉద్యోగుల తొడల మీద ?

మహిళా ఉద్యోగుల తొడల మీద ?

ప్రభుత్వ ఆసుపత్రిలో సాటి మహిళా ఉద్యోగులతో కామాంధుడైన డాక్టర్ రత్నాకర్ ఆసుపత్రిలోనే రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టాడు. నయానా భయానా 9 మంది మహిళా ఉద్యోగులను లొంగదీసుకున్న డాక్టర్ రత్నాకర్ ఆసుపత్రిలోని రోగుల బెడ్ మీదే దుకాణం పెట్టేశాడు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళతో పాద పూజలు చేయించుకోవడం, మహిళా ఉద్యోగుల తొడల మీద అతని కాళ్లు పెట్టి కాళ్లను ఒత్తించుకున్నాడు.

 క్యాబిన్ లో డ్యాన్స్ లు, నడుం మీద చేతులు వేసి ?

క్యాబిన్ లో డ్యాన్స్ లు, నడుం మీద చేతులు వేసి ?

డాక్టర్ రత్నాకర్ అతని క్యాబిన్ లో మహిళా ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ లు చేస్తూ రొమాన్స్ చేశాడు. మహిళా ఉద్యోగులను దగ్గరకు లాక్కొన్ని వారి నడుం మీద చేతులు వేసి ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేశాడు. డాక్టర్ రత్నాకర్ తిక్కచేష్టలు చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు బయటకు రావడం కలకలం రేపింది.

 బదిలీ చేస్తానని బెదిరింపులు..... ఉద్యోగాలు పీకేస్తానని వార్నింగ్

బదిలీ చేస్తానని బెదిరింపులు..... ఉద్యోగాలు పీకేస్తానని వార్నింగ్


డాక్టర్ రత్నాకర్ మహిళా ఉద్యోగులను లొంగదీసుకోవడానికి అతని అధికారం అడ్డం పెట్టుకున్నాడని వెలుగు చూసింది. లైంగిక కోరికలు తీర్చడానికి ఎదురుతిరిగిన మహిళా ఉద్యోగులను వేరే ఆసుపత్రికి బదిలీ చేస్తానని డాక్టర్ రత్నాకర్ బెదిరించాడని, కొందరిని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తానని, శాస్వతంగా ఉద్యోగాలు పీకిస్తానని డాక్టర్ రత్నాకర్ బెదిరించి ఇంతకాలం వారిని బెదిరించి ఎంజాయ్ చేశాడని వెలుగు చూసింది.

 ఉద్యోగం ఊడిపోయింది

ఉద్యోగం ఊడిపోయింది

ఆయుష్మాన్ నోడల్ ఆఫీసర్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రత్నాకర్ కర్మకాండ వెలుగు చూడటంతో అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశామని దక్షిణ కన్నడ జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజేంద్ర కవి మీడియాకు చెప్పారు. ఉడిపికి చెందిన డాక్టర్ రత్నాకర్ గతంలో కూడా ఇలాగే మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించి బదిలీ అయ్యాడు.

బుద్దిమాత్రం మారలేదు...... కుక్కబుద్ది

బుద్దిమాత్రం మారలేదు...... కుక్కబుద్ది


ఇంత జరిగినా డాక్టర్ రత్నాకర్ మాత్రం అతని తీరు మాత్రం మార్చుకోలేదని ఆరోపణలు వచ్చాయని, అతన్ని కాపాడటానికి ఆరోగ్యా శాఖ ప్రయత్నించదని జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజేంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రత్నాకర్ ఆసుపత్రిలోనే రాసలీలలు సాగిస్తున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంగళూకు బదిలి కాకముందు కూడా డాక్టర్ రత్నాకర్ అతను పని చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి చేష్టలు చేసి పై అధికారుల దగ్గర చివాట్లు తిన్నాడని తెలిసింది. ఇంకోసారి ఇలా జరగకుండా బుద్దిగా ఉద్యోగం చేసుకోవాలని డాక్టర్ రత్నాకర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు అతన్ని మంగళూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి బదిలి చేశారని తెలిసింది. అయితే అధికారులు ఎంత చెప్పినా, ఎంత చేసినా కుక్క తోక వంకరా అన్నట్లు డాక్టర్ రత్నాకర్ బుద్ది ఏమాత్రం మారలేదని, చివరికి సస్పెండ్ అయ్యాడని సాటి ఉద్యోగులు అంటున్నారు.

English summary
Doctor: Dakshina Kannada district Ayushman Nodel Officer Dr Ratnakar suspended for having sexual fun with women colleagues in Mangaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X