ఐఏఎస్ అధికారి మీద వరకట్నం వేధింపుల కేసు నమోదు, ఏడాది ముందు పెళ్లి, సార్ ?
బెంగళూరు/కొడుగు: దేశంలో ప్రతిఒక్కరికి న్యాయం జరిగేలా చూసుకునే బాధ్యత ఆ జిల్లాల కలెక్టర్ల మీద ఉంటుంది. పోలీసులు సైతం లా అండ్ ఆర్డర్ విషయంలో విధులు దుర్వినియోగం చేస్తే వారి మీద చర్యలు తీసుకునే అధికారం ఐఏఎస్ అధికారులకు ఉంటుంది. అలాంటి ఓ ఐఏఎస్ అధికారి మీద వరకట్నం వేధింపుల కేసు నమోదు అయితే ఆ వార్త హాట్ టాపిక్ అవుతోంది.
వివాహం జరిగిన ఏడాదికే ఐఏఎస్ అధికారి మీద ఆయన భార్య స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వరకట్నం వేధింపుల కేసు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆకాష్ కొడుగు జిల్లా పంచాయితీ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. యువకుడు అయిన ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆకాష్ అందరితో బాగుంటారని పైకి టాక్.

రిటైడ్ డీఐజీ సురేష్ కు డాక్టర్ వందనా అనే కుమార్తె ఉన్నారు. గత ఏడాది ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆకాష్ కు, మాజీ డీఐజీ సురేష్ కుమార్తె డాక్టర్ వందనాకు పెళ్లి చెయ్యాలని పెద్దలు అనుకున్నారు. ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆకాష్, డాక్టర్ వందనా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2022లో చాలా గ్రాండ్ గా ఇద్దరి పెళ్లి జరిగింది.
వివాహం జరిగిన ఏడాదికే తన భర్త డాక్టర్ ఆకాష్ అదనపు కట్నం కావాలని తనను టార్చర్ పెడుతున్నారని ఆరోపిస్తూ ఐఏఎస్ అధికారి భార్య డాక్టర్ వందనా బెంగళూరు ఈస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆకాష్ తో పాటు ఆయన తల్లిదండ్రులు. ఆకాష్ సోదరుడు కూడా అదనపు కట్నం కోసం తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన భర్తకు మద్దతు ఇస్తున్నారని డాక్టర్ వందనా ఆరోపించారు.
ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆకాష్ మీద ఆయన భార్య డాక్టర్ వందనా స్వయంగా కేసు పెట్టడంతో పోలీసులు వెంటనే ఐఏఎస్ అధికారి ఇంటికి వెళ్లి ప్రాథమిక విచారణ చేశారు. పోలీసుల విచారణలో డాక్టర్ వందనా వరకట్నం వేధింపులకు గురి అయ్యారని వెలుగు చూడటంతో ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆకాష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. డాక్టర్ వందనా మాజీ డీఐజీ సురేష్ కుమార్తె కావడంతో పోలీసు అధికారులు సైతం ఈ కేసును సీరియస్ గా తీసుకుంటున్నారని తెలిసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications