coronavirus: వైద్య సిబ్బంది వాహనంపై అల్లరిమూక దాడి, పోలీసులపై కూడా, ఎన్ఎస్ఏ కింద కేసు..
కరోనా వైరస్ సోకిన ఇద్దరిని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందికి ఓ సమూహం నుంచి చుక్కెదురైంది. వారి వాహనంపై 10 మందితో కూడిన మూక దాడికి తెగబడింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను కూడా వదల్లేదు. ఉత్తరప్రదేశ్ మొరదాబాద్‌లో బుధవారం ఉదయం ఘటన జరిగింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
మొరాదాబాద్ నవాబ్ జంగ్ ప్రాంతంలో ఇద్దరికీ కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించాయి. వారిని తీసుకెళ్లేందుకు వైద్య సిబ్బంది వచ్చారు. అయితే అనూహ్యంగా కొందరి నుంచి ప్రతిఘటన ఎదురైంది. వైద్యుల వాహనంపై రాళ్లతో దాడి చేశారు. కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు కూడా రంగంలోకి దిగారు. అయితే అల్లరిమూకలు పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. ఘటన తర్వాత దాడిచేసిన 10 మందిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మొరాదాబాద్‌లో వైద్య సిబ్బంది, పోలీసులపై అల్లరిమూకలు దాడిచేయడాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్‌గా తీసుకున్నారు. దుండగులపై జాతీయ భద్రతా చట్టం కింద కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను సీఎం ఆదేశించారు. అంతేకాదు దాడిలో జరిగిన నష్టాన్ని కూడా ఆ అల్లరిమూక భరించాలని సీఎం స్పష్టంచేశారు. వైద్య సిబ్బందిపై దాడి చేయడంతో.. ఆ ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications