కడుపులో కత్తి, 8 స్పూన్లు, స్క్రూడ్రైవర్లు, టూత్ బ్రెష్ లు: వైద్యులకు షాక్, ఆపరేషన్ చేస్తే !

మనాలి: మానసిక అస్వతకు గురైన వ్యక్తి కడుపులో కత్తి, స్పూన్లు తదితర వస్తువులు గుర్తించిన వైద్యులు షాక్ కు గురైనారు. కొన్ని గంటల పాటు శాస్త్ర చికిత్స చేసిన వైద్యులు అతని కడుపులోని వస్తువులు చాకచక్యంగా బయటకు తీసి అతన్ని ప్రాణాలతో కాపాడారు.

హిమాచల్ ప్రదేశ్ లోని మండియ సుందర్ నగరలో నివాసం ఉంటున్న 35 సంవత్సరాల వ్యక్తి మానసిక అస్వస్తతతో భాదపడుతున్నాడు. ఇతను ఇటీవల కడుపునొప్పితో అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు మండియ ప్రాంతంలోని శ్రీ లాల్ బహుద్దూర్ శాస్త్రి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.

 Doctors find spoons, knife, tooth brush in mans stomach in Manali

భాదితుడు కొన్ని రోజుల నుంచి కడుపునొప్పితో భాదపడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు వైద్యులకు చెప్పారు. వైద్యులు అతనికి స్కానింగ్ తీసి పరిశీలించగా షాక్ కు గురైనారు. భాదితుడి కడుపులో వంట గదిలో ఉపయోగించే ఒక కత్తి, 8 స్సూన్లు, రెండు టూత్ బ్రెష్ లు, రెండు స్క్రూడ్రైవర్లు ఉన్న విషయం గుర్తించారు.

వైద్యులు నాలుగు గంటల సేపు శ్రమించి శాస్త్ర చికిత్స చేసి అతని కడుపులో ఉన్న వస్తువులను బయటకు తీశారు. కత్తి మింగడంతో కడుపులో కొన్ని చోట్ల అతనికి గాయాలైనాయని, చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. భాదితుడి ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదని, కొన్ని రోజులు చికిత్స తీసుకోవాలని వైద్యులు చెప్పారు. అతను తెలిసి వాటిని మింగాడా, తెలీక మింగాడా అనే విషయం తెలియడం లేదని వైద్యులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+