కడుపులో నొప్పి అని ఆస్పత్రికి.. ఆపరేషన్ చేసి 62 స్టీల్ స్పూన్లు తీసిన డాక్టర్!
లక్నో: ఓ వ్యక్తి తన కడుపులో తీవ్రమైన నొప్పి ఉందని ఆస్పత్రికి వచ్చారు. దీంతో స్కాన్ చేసిన వైద్యులు షాక్ కి గురయ్యారు. వెంటనే ఆపరేషన్ చేసి అతని కడుపులోంచి 62 స్టీల్ చెంచాలు బయటికి తీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది.
32 ఏళ్ల విజయ్‌కు మంగళవారం 2 గంటల సుదీర్ఘ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత అతన్ని ఐసీయూకి తరలించారు. మీరు స్పూన్లు తిన్నారా? అని అడిగినప్పుడు.. అతడు ఒక సంవత్సరం పాటు వాటిని తింటున్నట్లు తెలిపాడని డాక్టర్ రాకేష్ ఖురానా తెలిపారు.

'ఆపరేషన్ సుమారు 2 గంటల పాటు కొనసాగింది. అతను ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. రోగి 1 సంవత్సరం నుంచి స్పూన్లు తింటున్నాడు' డాక్టర్ ఖురానా చెప్పారు.
2019లోనూ ఇలాంటి కేసు నమోదైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఒక వ్యక్తి కడుపు నుంచి వైద్యులు ఎనిమిది చెంచాలు, రెండు స్క్రూడ్రైవర్‌లు, రెండు టూత్ బ్రష్‌లు, వంటగది కత్తి, డోర్ లాచ్‌ను తొలగించారు.
UP | 62 spoons have been taken out from the stomach of 32-year-old patient, Vijay in Muzaffarnagar. We asked him if he ate those spoons & he agreed. Operation lasted for around 2 hours, he is currently in ICU. Patient has been eating spoons for 1 year: Dr Rakesh Khurrana (27.09) pic.twitter.com/tmqnfWJ2lY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 28, 2022
35 ఏళ్ల వ్యక్తి కడుపు సమస్యతో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరాడు. కడుపులో మొటిమలు ఉన్నాయని ఫిర్యాదు చేయగా, సుందర్‌నగర్‌లోని ఓ క్లినిక్ వైద్యులు అతడి కడుపులో కత్తి ఉన్నట్లు గుర్తించారు. ఎక్స్ రేలో పలు వస్తువులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు సర్జన్లతో కూడిన బృందం నాలుగు గంటలపాటు శస్త్రచికిత్స చేసి.. అన్ని వస్తువులను విజయవంతంగా తొలగించింది. ఒక సాధారణ వ్యక్తి చెంచా లేదా కత్తిని తినలేనందున రోగి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇది ఒక అరుదైన కేసు అని వైద్యులు వెల్లడించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications