పెట్స్ ఫైటింగ్, మధ్యలో దూరిన ఓనర్లు, శునకం దాడి చేయడంతో మరో డాగ్‌పై దాడి, చంపి..

కొన్ని ఘటనలు చిత్ర, విచిత్రంగా ఉంటాయి. వినడానికి కూడా కొత్తగా ఉంటాయి. అవును భోపాల్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. శునకాల గొడవ కాస్త యజమానుల వద్దకు చేరింది. ఎలా అంటే తమ.. పెట్‌పై దాడి చేసిందని... మరో కుక్కను చంపేంత కక్షకు దారితీసింది. మరో ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. శునకాన్ని హత్యచేసిన ముగ్గురిని వెతకడంతో పోలీసులు బిజీగా ఉన్నారు.

భోపాల్ రాతిబాద్ బాలాజీనగర్‌లో ఇరుగు పొరుగున రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే మరో శునకాన్ని.. ఒక డాగ్ కరిచింది. దీంతో వివాదం చెలరేగింది. కరిచినందుకు వ్యాక్సిన్ వేయిస్తానని చెప్పినా వినలేదు. ఇంకేముంది వాదన పీక్‌కి చేరింది. మరో ఇద్దరితో కలిసి ఇంట్లోకి ప్రవేశించారు. తమ పెట్‌పై దాడిచేసిన శునకంపై దాడి చేశారు. మెడపై చైన్ పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. తర్వాత అక్కడినుంచి మెల్లగా జారుకున్నారు.

Dog beaten, hanged by 3 men; police hunt for killers

తమ పెట్‌ను చంపేసిన నిందితులపై రాతిబాద్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముగ్గురిపై 506, 329 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసు అధికారి తెలిపారు. శునకాన్ని హత్యచేసిన ముగ్గురు పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. చనిపోయిన కుక్కను కూడా తమవెంట తీసుకెళ్లారని... వారు దొరికితే శునకం కళేబరం దొరుకుతుందని పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+