Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీ గురించి వద్దు! మహారాష్ట్ర చూసుకోండి: రౌత్‌కు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ కౌంటర్

ముంబై/లక్నో: మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్‌ ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు సాధువులు హత్యకు గురికావడంపై స్పందించిన విషయం తెలిసిందే. సంజయ్ రౌత్ యూపీ సర్కారుపై విమర్శపూర్వకంగా వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ ఘాటుగా బదులిచ్చారు.

యూపీలో ఘటన భయానకం..

యూపీలో ఘటన భయానకం..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన ఇద్దరు సాధువుల హత్యలపై సంజయ్ రౌత్ ఇటీవల స్పందిస్తూ.. ‘భయానకం.. యూపీలోని బులంద్‌షహర్‌లో ఇద్దరు సాధువులను హత్య చేశారు. అందరినీ నేను కోరెదొక్కటే, మహారాష్ట్రలో పాల్ఘర్ ఘటనను మత రాజకీయం చేసినట్లు ఇక్కడ చేయకండి' అని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేగాక, సీఎం యోగికి కూడా ఫోన్ చేసినట్లు తెలిపారు.

సాధువులను చంపడం రాజకీయంలా కనిపిస్తోందా?

సాధువులను చంపడం రాజకీయంలా కనిపిస్తోందా?

పాల్ఘర్‌లో ఇద్దరు సాధువులతోపాటు ఓ డ్రైవర్‌ను వందమందికిపైగా దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. యూపీ ఘటన జరిగిన వెంటనే థాక్రే కూడా యోగికి ఫోన్ చేశారు. సంజయ్ రౌత్, థాక్రే వ్యాఖ్యల నేపథ్యంలో యోగి కూడా తీవ్రంగా స్పందించారు. వరుస ట్వీట్లు చేశారు. నిర్మోహి అఖాడకు చెందిన వారు కావడంతో పాల్ఘర్‌లో సాధువుల హత్యపై తాను ఉద్ధవ్ థాక్రేకు ఫోన్ చేశానని తెలిపారు. సాధువులను చంపడం మీకు రాజకీయంలా కనిపిస్తోందా? అని యోగి మండిపడ్డారు.

Recommended Video

    Yogi Adityanath Not Going To Participate In His Father Last Rites

    యూపీలో యోగి నేతృత్వంలో చట్టం ఉంది.. దాని పని అది చేస్తుంది..

    ‘సంజయ్ రౌత్! మీ సైద్ధాంతిక దృష్టికోణంపై ఏమనాలి? పాల్ఘర్‌లో జరిగిన ఘాతుకానికి రాజకీయ ముద్ర వేస్తారా? మీ మాటలు, మీ నైతిక విలువులు, మారిన మీ రాజకీయ రంగులను ప్రతిబింబిస్తున్నాయి. ఇలాగే సంతృప్తి చెందుతారా? యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో చట్టం ఉంది. చట్టాన్ని అతిక్రమించిన వారిని అది శిక్షిస్తుంది. బులంద్ షహర్ ఘటన జరిగిన వెంటనే కఠిన చర్యలు తీసుకున్నాం. గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశాం. ముందు మీరు మహారాష్ట్ర సంగతి చూసుకోండి. మీకు ఉత్తరప్రదేశ్ గురించి ఆందోళన వద్దు' అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా బదులిచ్చారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+