• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శరీరం రెండు ముక్కలైనా టెక్కీ ఆత్మవిశ్వాసం చెదరలేదు

By Nageswara Rao
|

బెంగుళూరు: హరీష్ నింజప్ప (23) బెంగుళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు దేశంలోని కొన్ని కోట్ల మంది యవతకు ఆదర్శంగా నిలిచాడు. రోడ్డు ప్రమాదంలో మరికొద్ది నిమిషాల్లో తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా అతడు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికీ ఆదర్శమయింది.

వివరాల్లోకి వెళితే... తుముకూరు జిల్లాలోని సొంత గ్రామం గుబ్బిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటు వేసేందుకు వెళ్లాడు. తన ఓటుహక్కును వినియోగించుకొని బెంగళూరుకు తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.


కర్ణాటకలో ముగ్గురు మెడికోల ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా


జాతీయ రహదారి 4పై ఉన్న తిప్పగొండనహళ్లి అనే గ్రామం వద్ద పంచాదార బస్తాల లోడ్‌తో వస్తున్న ఓ లారీ పల్సర్‌పై వెళుతున్న హరీశ్‌ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. దీంతో అతడి శరీరం రెండు ముక్కలైంది. అయితే అతడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకు ఎలాంటి గాయాలు కాలేదు.

Donate my organs, biker cut in half tells docs in Bengaluru

అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తూనే, హైవే అంబులెన్స్ పై ఆసుపత్రికి తరలించారు. ప్రాణం పోతుందని తెలిసిన నింజప్ప రోడ్డుపై వెళ్లేవారిని దగ్గరకు పిలిచిన తన అవయవాల్లో ఏది పనికొస్తే అది దానం చేయాల్సిందిగా కోరాడు. ఇదే విషయాన్ని డాక్టర్లకు చెప్పాలని కోరాడు.

యాక్సిడెంట్ తరువాత 8 నిమిషాల్లోపే అతడిని ఆసుపత్రిలో చేర్చగా, ఆపై మరికొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతడి చివరి కోరిక మేరకను వైద్యులు అతడి ప్రాణాలు కాపాడలేకపోయినా కళ్లను సేకరించి ఆస్పత్రిలో భద్రపరిచారు.

బ్యాంకులకు లాజిస్టిక్ సేవలందించే ఎస్ఎస్ఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి హరీష్ నింజప్ప కళ్లు ఇప్పుడు నారాయణా నేత్రాలయాలో భద్రంగా ఉన్నాయని, ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ భుజంగ శెట్టి తెలిపారు. అంతటి ఘోర రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర బాధాకరమైన పరిస్థితుల్లో నింజప్ప తన అవయవాలు దానం చేయాలన్న ఆలోచన రావడం నిజంగా ఆశ్చర్యకరమన్నారు.

ఈ ప్రమాదంలో మనిషి రెండుగా ఎలా తెగిపడ్డాడో చూస్తేనే చాలా బాధేస్తుందని ఆయన తెలిపారు. ప్రమాదంలో ఎముకలు, కండరాలు, రక్తనాళాలు తెగిపోయాయని, మెదడుకు మాత్రం ఏం కాలేదని నింజప్పను తరలించిన హోస్మాత్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అజిత్ బెనడిక్ట్ వెల్లడించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
youth was cut into half after a truck hit his motorcycle and ran over him on the Tumakuru-Bengaluru road on Tuesday morning. As he clung on to life, he pleaded with those who took him to hospital, and the doctors, to harvest his organs and donate these to those in need.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more