గుడ్ న్యూస్.. డోన్ట్ మిస్: దరఖాస్తులను ఆహ్వానిస్తోన్న JSW Steel
కర్ణాటక బళ్లారి సమీపంలోని తోరణగల్లులో గల జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ శుభవార్త వినిపించింది. డిప్లొమా అప్రెంటిస్ నియామకం కోసం క్యాంపస్ సెలక్షన్ నిర్వహిస్తోంది. వివిధ సాంకేతిక విభాగాల్లో పనిచేయడానికి అర్హులైన డిప్లొమా అభ్యర్థులు తమ దరఖాస్తులను దాఖలు చేసుకోవచ్చు.
2025-26 సంవత్సరానికిగాను అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం కోసం అభ్యర్థులను నామినేట్ చేయాల్సిందిగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ విద్యా సంస్థలను కోరింది. ఈ కార్యక్రమం కింద అభ్యర్థులకు స్టైపెండ్‌తో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. డిప్లొమా శిక్షణా కాలం ఒక సంవత్సరం ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ. 15,500ల స్టైపెండ్ చెల్లిస్తారు. అదనంగా.. అభ్యర్థులకు సంవత్సరానికి 14 రోజుల సెలవులు మంజూరు చేస్తారు.

నివాస వసతి, రవాణా సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తుంది జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్. ప్రతి నెలా రూ. 650/- విలువైన ఫుడ్ కూపన్‌ను అందిస్తుంది. క్యాంటీన్‌లో పనివేళల్లో రాయితీ ధరలకు భోజనం లభిస్తుంది. అంతేకాకుండా రెండు లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది. ఈ వైద్య బీమా సౌకర్యం.. అప్రెంటిస్ లో చేరిన అభ్యర్థికి మాత్రమే వర్తిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు ఈ సౌకర్యం వర్తించదు.
అప్రెంటిస్‌షిప్ కోసం అర్హత..
అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాల లోపు ఉండాలి. పురుషులు కనీసం 165 సెంటీమీటర్ల ఎత్తు, 51 కిలోల బరువు ఉండాలి. మహిళలు కనీసం 150 సెంటీ మీటర్ల ఎత్తు, 45 కిలోల బరువు ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రీ-మెడికల్ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలి.
మరింత సమాచారం కోసం 90350 05904, 82172 54413, 90350 05905, 91283 76716 నంబర్లను సంప్రదించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు [email protected] కు ఇమెయిల్ చేయవచ్చు.
అప్రెంటిస్‌షిప్ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అసెస్మెంట్ అనంతరం అర్హత సాధించిన వారికి అసోసియేట్ స్థాయి ఉద్యోగాలు లభిస్తాయని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ తెలిపింది.
ఉద్యోగ స్వభావాన్ని బట్టి వేతనాలు నిర్ధారిస్తారు. సాధారణ ఉద్యోగాలకు నెలకు రూ. 17,500ల స్థూల వేతనం లభిస్తుంది. సెమీ క్రిటికల్ ఉద్యోగులకు రూ. 18,000లు, హై క్రిటికల్ ఉద్యోగాలకు రూ. 19,000ల స్థూల వేతనం అందుతుంది.
దీంతో పాటు అభ్యర్థులు ప్రతి నెలా 2,000 రూపాయల వరకు ప్రొడక్షన్ ఇన్సెంటివ్ పొందవచ్చు. పీఎఫ్ కింద మేనేజ్మెంట్ వాటా 12, ఈఎస్ఐ, బీమా సౌకర్యం, బోనస్, గ్రాట్యుటీ అందుబాటులో ఉంటాయి. సంవత్సరానికి ఏడు క్యాజువల్ లీవులు, 15 ఆర్జిత సెలవులు లభిస్తాయి.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications