నా భార్య అందంగా ఎందుకు తయారైయ్యింది ?: అక్రమ సంబంధం, అనుమానం, కసితీరి పొడిచి చంపేసి!
చెన్నై: నేను లేని సమయంలో నా భార్య ఎందుకు అంత అందంగా తయారౌతోంది, తన భార్య వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం సాగిస్తోందని అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. నిత్యం నువ్వు ఎందుకు అంత అందంగా తయారౌతున్నావు, నువ్వు అందంగా ఉండటం తనకు ఇష్టం లేదని, నేను చెప్పినట్లు ఉండాలని నిత్యం భార్యతో గొడవపడ్డాడు. పెద్దలు పంచాయితీలు చేసి రెండు వారాల క్రితం కాపురానికి పంపించిన భార్యను ఆమె భర్త దారుణంగా హత్య చేసి నేరుగా వెళ్లి చెన్నై పోలీసుల ముందు లొంగిపోయాడు. తల్లి హత్యకు గురి కావడం, తండ్రి జైలుకు వెళ్లడంతో ఇద్దరు కుమార్తెలు రోడ్డున పడ్డారు.

20 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి
చెన్నైలోని పుళల్ గాంధీ వీధికి చెందిన వెట్రివీరన్ (47), ఝాన్సీ (40) 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెద్దలను ఎదరించి వివాహం చేసుకున్నారు. వెట్రివీరన్, ఝాన్సీ దంపతులకు మణిమొళి ( 19), సింధుజ (17) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహం అయిన కొన్ని సంవత్సరాలు వెట్రివీరన్, ఝాన్సీ దంపతులు కాపురం సాఫీగా సాగిపోయింది. పిల్లలు పుట్టిన తరువాత వెట్రివీరన్, ఝాన్సీ కుటుంబ సభ్యులు కలిసిపోయారు.

అందంగా తయారైన భార్య
చెన్నైలోని పాండీ ప్రాంతంలోని ప్రైవేట్ కంపెనీలో వెట్రివీరన్ ఉద్యోగం చేస్తున్నాడు. ఝాన్సీ చూడటానికి చాలా అందంగా ఉంటోంది. ప్రతిరోజూ ఝాన్సీ అందంగా తయారు కావడం ఆమెకు అలావాటు అయ్యింది. భర్త వెట్రివీరన్ ఉద్యోగానికి వెళ్లిన తరువాత ఇద్దరు కుమార్తెలు కాలేజ్ కు వెలుతున్నారు.

భార్య మీద అనుమానం
తాను ఉద్యోగానికి వెళ్లిన తరువాత తన భార్య ఝాన్సీ అందంగా తయారు కావడం వెట్రివీరన్ కు నచ్చలేదు. నేను ఇంటిలో లేని సమయంలో నువ్వు ఎందుకు అందంగా తయారౌతున్నావు, నేను ఉన్న సమయంలోనే నువ్వు అందంగా తయారు కావాలని వెట్రివీరన్ భార్యతో గొడవ పెట్టుకునేవాడు. అయితే ఝాన్నీ మాత్రం ప్రతిరోజూ అందంగానే తయారు అయ్యేది. తన భార్య వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం సాగిస్తోందని, అందుకే నేను లేని సమయంలో అందంగా తయారౌతోందని వెట్రివీరన్ కు రానురాను అనుమానం పెరిగిపోయింది.

విడిపోయిన దంపతులు
నిత్యం వెట్రివీరన్, ఝాన్సీ దంపతులు ఇంటిలో గొడవలు పడేవారు. రోజురోజుకు భార్య ఝాన్సీ మీద వెట్రివీరన్ కు అనుమానం పెరిగిపోయింది. భర్త మాటలను పెద్దగా పట్టించుకోని ఝాన్సీ మాత్రం రోజూ అదంగా తయారు అయ్యేది. దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో ఆరు నెలల క్రితం విడిపోయారు. ఝాన్సీ, వెట్రివీరన్ వేరువేరుగా జీవనం సాగించారు.

పెద్దలు పంచాయితీ చేసి !
ఇద్దరు అమ్మాయిల భవిష్యత్తు ఆలోచించాలని, ఇద్దరు ఒక్కటి కావాలని పెద్దలు ఝాన్సీ, వెట్రివీరన్ కు నచ్చచెప్పారు. పెద్దలు పంచాయితీ చేసి ఇద్దరు ఇక ముందు గొడవలు పడకూడదని రెండు వారాల క్రితం వెట్రివీరన్, ఝాన్సీ దంపతులను ఒక్కటి చేశారు. రెండు వారాల నుంచి వెట్రివీరన్, ఝాన్సీ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు.

రాత్రి భార్య అందంగా ఉందని !
రాత్రి భర్త వెట్రివీరన్ ఇంటికి వెళ్లేసరికి ఝాన్సీ అందంగా తయారైయ్యింది. తాను ఇంటిలో లేని సమయంలోనే నువ్వు ఎందుకు అంత అందంగా తయారౌతావని భార్య ఝాన్సీతో వెట్రివీరన్ గొడవ పెట్టుకున్నాడు. తాను అందంగానే తయారౌతానని, నువ్వు చెప్పినట్లు ఉండటం తనవల్ల కాదని ఝాన్సీ తేల్చి చెప్పింది.

కత్తితో కసితీర పొడిచి చంపేశాడు
గొడవ తారాస్థాయికి చేరడంతో వంట గదిలోకి వెళ్లిన వెట్రివీరన్ కత్తి తీసుకు వచ్చి బెడ్ రూంలో ఉన్న భార్య ఝాన్సీ గొంతు, కడుపు తదితర చోట్ల కసితీర ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. కత్తిపోట్లు ఎక్కువ కావడంతో ఝాన్సీ అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. రాత్రి మొత్తం భార్య ఝాన్సీ శవం పక్కన జాగారం చేసిన వెట్రివీరన్ మద్యాహ్నం పుళల్ పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసుల ముందు లొంగిపొయాడు. తన భార్య ఝాన్సీకి వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం ఉందని, అందుకే తాను ఆమెను హత్య చేశానని వెట్రివీరన్ అంగీకరించడాని పుళల్ పోలీసులు తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications