జయలలిత మరణం:సందేహలు వ్యక్తం చేసిన డాక్టర్ రామసీత అరెస్టు, న్యాయవిచారణకు డిమాండ్

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రిజయలలిత మరణంపై డాక్టర్ రామసీత అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు.జయ మరణంపై అనుమానాలున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్న తరుణంలోనే డాక్టర్ రామసీత

చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన డాక్టర్ రామసీతను శనివారం నాడు చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.జయలలిత మృతిపై న్యాయవిచారణ జరిపించాలనే డిమాండ్ నెలకొన్న తరుణంలో డాక్టర్ రామసీత వ్యాఖ్యలు సంచలనం కల్గించాయి.

ఒక డాక్టర్ గా జయలలిత మరణంపై తనకు అనేక అనుమానాలున్నాయని ఆమె ఆరోపణలు గుప్పించారు. ఇంటి నుండి ఆపోలో ఆసుపత్రికి వచ్చేసమయానికే జయలలిత స్పృహలోనే లేరని చెప్పారు.

ఆమె వెంట బంధువులు కూడ ఎవరూ లేరన్నారు.జయలలిత చికిత్స పొందే ప్రత్యేక గది వైపు ఏ ఒక్క డాక్టర్ ను కూడ అనుమతించలేదని ఆమె చెప్పారు.

jayalalithaa

జయలలిత జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నాడు ఆమె మరణం గురించి డాక్టర్ రామసీత చేసిన ఆరోపణలు తమిళనాడులో కలకలాన్ని రేపాయి.

డాక్టర్ రామసీత జయలలిత మరణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, జయలలిత మేనకోడలు దీప జయకుమార్ వేర్వేరుగా వచ్చి డాక్టర్ రామసీతకు మద్దతు ప్రకటించారు.

అయితే జయలలిత మరణంపై అనుమానాలున్నాయని వ్యాఖ్యలు చేసిన డాక్టర్ రామసీతను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై మూడు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.రామసీత అసలు డాక్టర్ కాదని సైబర్ క్రైమ్ పోలీసులు వాదిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+