నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా డాక్టర్ సుమన్ బేరీ, రాజీవ్ కుమార్ స్థానంలో నియామకం
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ కొత్త చైర్మన్ నియామకం ఖరారైపోయింది. ఐదేళ్ల క్రితం పాలసీ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా నియామకైన రాజీవ్ కుమార్ తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పీటీఐ నివేదించింది. తన పూర్వీకుడు అరవింద్ పనగారియా నీతి ఆయోగ్ నుంచి వైదొలిగిన తర్వాత రాజీవ్ కుమార్ ఆగస్టు 2017లో వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలో కొత్త వైస్ చైర్మన్‌గా డాక్టర్ సుమన్ కె బెరీ నియమితులయ్యారు. మే 1, 2022 నుంచి బెరీ బాధ్యతలు స్వీకరిస్తారని అధికారిక ఉత్తర్వు తెలిపింది. కాగా, సుమన్ బెరీ అంతకుముందు న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) డైరెక్టర్ జనరల్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్)గా పనిచేశారు. అతను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి, స్టాటిస్టికల్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానానికి సంబంధించిన సాంకేతిక సలహా కమిటీలో కూడా సభ్యుడు.
కాగా, రాజీవ్ కుమార్ పదవీకాలం ఏప్రిల్ 30తో ముగియనుంది. ఉత్తర్వుల ప్రకారం.. కుమార్ రాజీనామా ఆమోదించబడింది. ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి వచ్చేలా ఆయన పదవి నుంచి రిలీవ్ చేయబడతారు. డా. కుమార్ లక్నో విశ్వవిద్యాలయం (1978) నుంచి ఆర్థికశాస్త్రంలో Ph.D, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (1982) నుంచి D.Phil పొందారు.

ఆక్స్‌ఫర్డ్‌లో తన డి.ఫిల్ పూర్తి చేసిన తర్వాత, డాక్టర్. కుమార్ 1982-1987 సమయంలో ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER)లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌గా తన విద్యా వృత్తిని ప్రారంభించారు.
అతను 1987-89 మధ్యకాలంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT)లో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అతను తర్వాత 2006, 2011 మధ్య ICRIER డైరెక్టర్ & CEO అయ్యాడు. అతను 2013-16, ఢిల్లీ నుండి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (CPR)లో సీనియర్ ఫెలోగా పనిచేశాడు. అతను 2013లో లాభాపేక్షలేని పరిశోధన థింక్ ట్యాంక్ అయిన పహ్లే ఇండియా ఫౌండేషన్‌ను స్థాపించాడు, దానికి కూడా అతను 2017 వరకు నాయకత్వం వహించారు. అతను రెండు పర్యాయాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డులలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో కూడా పనిచేశారు.
Dr Suman K Bery appointed as Vice-Chairman of the NITI Aayog after Dr Rajiv Kumar stepped down from his post. pic.twitter.com/6vQ9HWUSNJ
— ANI (@ANI) April 22, 2022












Click it and Unblock the Notifications