DRDO మరో ముందడుగు: దేశీయంగా తయారుచేసిన Anti-Tank Missile విజయవంతం -ఆత్మనిర్భర్ భారత్
రాబోయే కాలంలో రక్షణ రంగానికి సంబంధించిన అవసరాలను దేశీయంగానే తీర్చుకోవాలన్న లక్ష్యంతో మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ విధానం వేగంగా అమలవుతున్నది. ఆత్మనిర్భర్ భారత్ సాధించే దిశగా భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) మరో ముందడుగు వేసింది. శత్రుదేశ యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే ఎమ్‌పీఏటీజీఎమ్(మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్) క్షిపణిని బుధవారం విజయవంతంగా ప్రయోగించింది.
మ్యాన్ పోర్టబుల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. సమీపంలోని లక్ష్యాలను క్షిపణి కచ్చితంగా ఛేదించగలదని ఈ ప్రయోగంలో రుజువైందని పేర్కొన్నాయి. ఇక సుదూర టార్గెట్లకు సంబంధించి గతంలో జరిగిన పరీక్షలు విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ మిస్సైల్‌లో అత్యాధునిక ఇన్‌ఫ్రా రెడ్ సీకర్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉన్నాయని డీఆర్‌డీఓ పేర్కొంది.

ఈ ప్రయోగం ద్వారా దేశీయ క్షిపణి సైనిక శక్తి మరింత పటిష్టమవుతుందని డీఆర్‌డీఓ తెలిపింది. ఈ క్షిపణి గరిష్ఠ పరిధిలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించగా.. కనిష్ఠ పరిధిలో చేపట్టిన ప్రస్తుత పరీక్ష కూడా విజయవంతమైంది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ గరిష్ఠ పరిధి 2.5 కిలోమీటర్లు. ఇది 15 కిలోల బరువు ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా మోసుకెళ్లేలా డీఆర్‌డీఓ రూపొందించింది.












Click it and Unblock the Notifications